పన్నెండవ ఎన్‌ఆర్‌జె మ్యూజిక్ అవార్డుల కార్యక్రమంలో మెరిసిన తారలు
ప్రాన్స్‌లో జరిగినటువంటి పన్నెండవ ఎన్‌ఆర్‌జె మ్యూజిక్ అవార్డుల కార్యక్రమంలో కోలంబియన్ సూపర్ స్టార్ షకీరాకు ఇంటర్నేషనల్ ఫీమేల్ ఆర్టిస్ట్ అఫ్ ద ఇయర్ అవార్డు ప్రదానం చేయడం జరిగింది. అంతేకాకుండా వాకా వాకా(దిస్ టైమ్ ఫర్ అమెరికా)అనే ట్రాక్‌కు గాను ఇంటర్నేషనల్ సాంగ్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని కూడా సోంతం చేసుకున్నారు. ఇకపోతే ఇంటర్నేషనల్ మేల్ ఆర్టస్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకుగాను వుషర్ నామినేట్ అయ్యారు.
హిప్ హాప్ గ్రూప్ విషయానికి వస్తే ఇండర్నేషనల్ గ్రూప్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని బ్లాక్ పీస్ స్టార్స్ విల్ ఐ యామ్, ఏపిల్ డీ ఏపి సోంతం చేసుకున్నారు. మ్యూజిక్ వీడియో ఆఫ్ ద ఇయర్ విషయానికి వస్తే పాప్ సింగర్ లేడిగాగా, బేయాన్స్ సంయుక్తంగా అవార్డుని సోంతం చేసుకున్నారు. అన్నింటికంటే అత్యంత ప్రముఖమైన ఇంటర్నేషనల్ రివల్యూషన్ ఆఫ్ ద ఇయిర్ ప్రైజ్‌ను పాప్ యువ తరంగం జస్టిన్ బైబర్ కైవసం చేసుకున్నాడు. ప్రతి సంవత్సరం నిర్వహించేటటువంటి ఈ ఎన్‌ఆర్‌జె మ్యూజిక్ అవార్డుల కార్యక్రమాన్ని ప్రెంచ్ రేడియా స్టేషన్ వారు నిర్వహిస్తుంటారు.


Click it and Unblock the Notifications











