»   » 100 మిలియన్స్‌తో షకీరా సరికొత్త వరల్డ్ రికార్డ్ (ఫోటోస్)

100 మిలియన్స్‌తో షకీరా సరికొత్త వరల్డ్ రికార్డ్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పాప్ స్టార్ షకీరా సరికొత్త వరల్డ్ రికార్డ్ నమోదు చేసింది. సోషల్ నెట్వర్కింగ్ ఫేస్ బుక్‌లో ఆమెను ఫాలో అయ్యేవారి సంఖ్య ఏకంగా 100 మిలియన్లను చేరుకుంది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ సెలబ్రిటీకీ...ఏ సోషల్ నెట్వర్కింగులోనూ ఇంత మంది ఫాలోవర్స్ లేరు.

37 ఏళ్ల ఈ కొలంబియన్ సింగర్....ప్రపంచ వ్యాప్తంగా ఇంత మంది ఫాలోవర్స్‌ను సొంతం చేసుకోవడం ప్రపంచ రికార్డు అని, ఈ రికార్డు సాధించిన మొట్ట మొదటి సెలబ్రిటీ కూడా ఆమే అని వరల్డ్ మీడియా ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. తనను అభిమానులు ఇంతగా ఆదరించడంపై షకీరా ఆనందం వ్యక్తం చేసింది. దీన్ని నేను గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు షకీరా వెల్లడించారు.

మరిన్ని వివరాలు స్లైడ్ షోలో...

ఫేస్ బుక్ సీఈఓ కంగ్రాట్స్

ఫేస్ బుక్ సీఈఓ కంగ్రాట్స్


ఫేస్ బుక్ చరిత్రలో షకీరా చారిత్రాత్మక మైల్ స్టోన్ అందుకున్న సందర్భంగా ఫేస్‌బుక్ సంస్థ సీఈవో మార్క్ జుకెర్‌బర్గ్ ఆమెకు కంగ్రాట్స్ తెలియజేసారు. ‘కంగ్రాట్స్! వాట్ ఆన్ అమేజింగ్ మైల్ స్టోన్ ఫర్ ఆన్ అమేజింగ్ పర్సన్' అంటూ ఆమె పేజీపై కామెంట్స్ చేసారు. తన ఫాలోవర్స్ 100 మిలియన్లకు చేరువైన సందర్భంగా...అభిమానులకు థాంక్స్ చెబుతూ షకీరా ఓ వీడియో కూడా పోస్టు చేసింది.

షకీరా బాయ్ ఫ్రెండ్

షకీరా బాయ్ ఫ్రెండ్


షకీరా పర్సనల్ విషయాల్లోకి వెళితే...బాయ్ ఫ్రెండ్ గెరార్డ్ పిక్‍‌‌తో గత కొంత కాలంగా సహజీవనం చేస్తోంది. గెరార్డ్ పిక్‍‌‌తో ద్వారా జనవరి 22, 2013న షకీరా మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తమ ప్రేమకు గుర్తుగా జన్మించిన ఈ బిడ్డకు ఇద్దరి ఇంటి పేర్లు కలిసి వచ్చేలా ‘మిలన్ పిక్ మెబారక్' అని నామకరణం చేసారు.

షకీరా గతంలో...

షకీరా గతంలో...


షకీరా గతంలో యాంటోనియో డిలా రూతో దాదాపు 11 సంవత్సరాలు(2000-2010) డేటింగ్ చేసింది. 2010లో ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో విడిపోయారు.

ఫుట్ బాల్ ఆటగాడితో...

ఫుట్ బాల్ ఆటగాడితో...


ఆ తర్వాత షకీరా స్పానిష్ దేశపు పుట్ బాల్ ఆటగాడు గెరార్డ్ పిక్‍‌తో జత కట్టింది. యాంటోనియో డి లా 11 సంవత్సరాల డేటింగులో గర్భం దాల్చని షకీరా..... రెండు మూడేళ్ల కాలంలోనే గెరార్డ్ పిక్‍ ద్వారా గర్భం దాల్చడం గమనార్హం.

English summary
Grammy-winner Shakira has set a record on Facebook by becoming the first celebrity to garner 100 million likes on the social networking site.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu