»   »  ప్రేమ కాదు కామం: టీవీ హాట్ లేడీపై అతని కళ్లు పడ్డాయి!

ప్రేమ కాదు కామం: టీవీ హాట్ లేడీపై అతని కళ్లు పడ్డాయి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ కామ కలాపాల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. భార్య ఉండగానే అప్పట్లో ఇద్దరు మోడళ్లతో సరసాలు చేస్తూ మీడియాలో చర్చనీయాంశం అయ్యాడు. ఆ తర్వాత హాలీవుడ్ బ్యూటీ ఎలిజబెత్ హార్లేతో ప్రేమాయణంతో వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు.

ఇటీవల ఎలిజబెత్ హార్లేతో తెగదెంపులు చేసుకున్న షేన్ వార్న్....లోదుస్తుల మాజీ మోడల్ మిచెల్లీ మోన్‌తో రొమాన్స్ సాగిస్తున్నాడనే వార్తలు కూడా వినిపించాయి. ఎలిజబెత్ హర్లేతో 'సంబంధం' కటీఫ్ అయ్యిందంటూ యూకే మీడియాలో ఊహాగానాలు ఊపందుకున్న నేపథ్యంలో 44 ఏళ్ల వార్న్ మరో మోడల్‌తో 'అత్యంత సన్నిహితం'గా ఉన్నాడన్న వార్తలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

 Shane Warne wants to date Sofia Vergara

తాజాగా వార్న్ కళ్లు మరో భామపై పడ్డాయి. మోడర్న్ ఫ్యామిలీ టెలివిజన్ సీరియల్ తార సోఫియా వెర్గరాతో డేటింగ్ చేయాలని ఉందని షేన్ వార్న్ ఓ రేడియో కార్యక్రమంలో తన మనసులో మాట బయటపెట్టాడు. ఎవరితో డేటింగ్ చేయాలని ఉందని అడిగిన ప్రశ్నకు సోఫియాతో డేటింగ్ చేయాలనుందని షేన్ వార్న్ జవాబిచ్చారు.

సోఫియా అభిమానిని నేను. ఆమె గొప్పగా ఉంటుంది. ప్రయత్నించడంలో తప్పేమి లేదు. మహిళలతో మర్యాదగా ప్రవర్తించే అంశంలో నాట్రాక్ రికార్డు బాగానే ఉంది అని రేడియో కార్యక్రమంలోతెలిపారు. సోఫియా వెర్గారా కూడా ఇటీవలే తన ప్రియుడికి గుడ్ బై చెప్పింది. మరి షేన్ వార్న్ ప్రపోజల్‌‍కి అమ్మడు ఆ బ్యూటీ ఎలా స్పందిస్తుందనే విషయం చర్చనీయాంశం అయింది. ఇంతకీ షేన్ వార్న్ ఆమెపై ప్రేమ పెంచుకున్నాడా? ఆమె బ్యూటీని చూసి కామం అదుపుచేసుకోలేక పోతున్నాడా? అనే విషయం తేల్చుకోలేక పోతున్నారు అభిమానులు.

English summary

 Former Australian cricketer Shane Warne, who broke up with socialite Liz Hurley earlier this year, reportedly wants to date ‘Modern Family’ star Sofia Vergara.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu