For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  డ్రగ్స్ మత్తులో రేప్ చేశారు.. చనిపోయానని వదిలేశారు.. రేప్ ఘటనను బయటపెట్టిన సింగర్

  |

  హాలీవుడ్‌లో ప్రముఖ సింగర్ డెమీ లవాటో తన జీవితానికి సంబంధించిన సంచలన విషయాలను బయటపెట్టారు. కొద్ది సంవత్సరాల క్రితం ఓ డ్రగ్ డీలర్ తనకు మితి మీరిన మోతాదులో మాదక ద్రవ్యాలను ఇచ్చి తనను రేప్ చేశాడనే విషయాన్ని బయటపెట్టడం సంచలనం రేపింది. ఇటీవల తన జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన డాక్యుమెంటరీని అమెరికాలోని ఎస్ఎక్స్ఎస్‌డబ్ల్యూ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా డెమీ లవాటో మాట్లాడుతూ..

  డేమీ లవాటో కెరీర్

  డేమీ లవాటో కెరీర్

  బ్రేక్ త్రూ విత్ క్యాంప్ రాక్ అండ్ డోంట్ ఫర్గెట్ ఆల్బమ్‌తో కెరీర్ ఆరంభించిన డెమీ లవాటో.. ఆ తర్వాత అన్‌బ్రోకెన్ అండ్ ది ఎక్స్ ఫ్యాక్టర్, డెమీ, కాన్ఫిడెంట్, టెల్ మీ యూ లవ్ మీ, అన్‌బ్రోకెన్ అండ్ ది ఎక్స్ ఫ్యాక్టర్, డెమీ లాంటి ఆల్బమ్‌తో ఆకట్టుకొన్నారు. అయితే తన జీవితంలో సంఘటనల ఆధారంగా డేమీ లవాటో: డ్యాన్సింగ్ విత్ ది డెవిల్ అనే డాక్యుమెంటరీని రూపొందించారు. ఈ సందర్బంగా తన రేప్‌ సంఘటన షేర్ చేసుకొన్నారు.

  2018లో నాపై దారుణంగా

  2018లో నాపై దారుణంగా

  జూలై 2018లో నాకు చేదు సంఘటన ఎదురైంది. నాకు డ్రగ్స్ ఇప్పించి సృహ కోల్పోయేలా చేశారు. దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని నాపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. నేను నమ్మినా వాళ్లే నాకు అన్యాయం చేశారు. దాంతో 15 వయసులోనే కన్యాత్వాన్ని కోల్పోయాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

  తాళ్లతో బంధించి అఘాయిత్యం

  తాళ్లతో బంధించి అఘాయిత్యం

  లావోటో స్నేహితుడు సిరా మిచ్చెల్ మాట్లాడుతూ.. ఆ రోజు రాత్రి ఆమెను తాళ్లతో బంధించారు. భారీ మొత్తంలో హెరాయిన్ ఇచ్చారు. ఆమె పరిస్థితి చూస్తే బతకడం కష్టం అనిపించింది. కానీ ఆమె జాతకం బాగుండి బతికి బట్టకట్టింది. ఆ దారుణమైన సంఘటన నాకు షాక్ కలిగించింది అని అన్నారు.

  చనిపోయానని వదిలి వేసి వెళ్లారు

  చనిపోయానని వదిలి వేసి వెళ్లారు

  నేను దారుణమైన పరిస్థితుల్లో ఉన్నానని తెలిసి నా స్నేహితులు వచ్చారు. అప్పటికి నేను నగ్నంగా బెడ్‌పై పడి ఉన్నాను. నేను చనిపోయాననుకొని వాళ్లు వదిలి వేసి వెళ్లారు. హాస్పిటల్‌లో కళ్లు తెరిచిన తర్వాత నీ అంగీకారంతోనే సెక్స్ జరిగిందా అని ప్రశ్నించారు. దాంతో నేను కంగుతిన్నాను. వాళ్లు ఇచ్చిన డ్రగ్స్ మత్తు నన్ను నెలపాటు వెంటాడింది అంటూ తన అనుభవాలను డెమీ లావోటో చెప్పారు.

  నాపై 15 వయసులో లైంగిక దాడి

  నాపై 15 వయసులో లైంగిక దాడి

  అంతకు ముందు నా టీనేజ్‌లో అలాంటి సంఘటనే జరిగింది. ఆ సమయంలో జరిగిన అత్యాచారంతో నా కన్యత్వాన్ని మొదటిసారి కోల్పోయాను. ఆ సమయంలో శృంగారానికి రెడీగా లేను. అలాంటి పరిస్థితుల్లో నాపై లైంగిక దాడి జరిగింది అంటూ డెమీ లావాటో చెప్పింది.

  యూట్యూబ్‌లో డెమీ లవాటో డాక్యుమెంటరీ

  యూట్యూబ్‌లో డెమీ లవాటో డాక్యుమెంటరీ

  డెమీ లవాటో జీవితం ఆధారంగా రూపొందిన డాక్యుమెంటరికీ మంచి రెస్పాన్స్ లభిస్తున్నది. అమెరికాలో ప్రదర్శించిన ప్రీమియర్‌ షోపై సినీ విమర్శకులు మంచి స్పందనను వ్యక్తం చేశారు. డెమీ లవాటో: డ్యాన్సింగ్ విత్ ది డెవిల్ డ్యాక్యుమెంటరీ మార్చి 23న యూట్యూబ్‌లో ప్రసారం కానున్నది.

  English summary
  Demi Lovato about sexual assault: I lost my virginity in a rape. She said, sexual assault by her drug dealer on the night of her overdose.Her documentary Demi Lovato: Dancing with the Devil telecast in youtube on March 23.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X