For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌' సినిమా తనికి శాపం గా మారిందంటున్న హీరో

  By Srikanya
  |

  లాస్ ఏంజిల్స్ :స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్‌ అయిపోయాడు ఇండియన్‌ కుర్రాడు దేవ్‌ పటేల్‌. ఆ సినిమా అతడికి హాలీవుడ్లో మరికొన్ని అవకాశాలు తెచ్చిపెట్టింది. అంతకు ముందు దేవ్ పటేల్ అనే వ్యక్తి ఎవరీకి తెలియదు. అలాంటి సినిమా గురించి ఎవరైనా ఏం చెప్తారు...అధ్బుతం, నా జీవితంలో అరుదైన సినిమా అంటారు. కానీ దేవ్ పటేల్ మాత్రం అందరికీ భిన్నంగా...ఆ సినిమా తనకో శాపం అంటూ తేల్చేసాడు. అలా ఎందుకు అనాల్సి వచ్చిందో చూద్దాం.

  దేవ్ పటేల్ మాట్లాడుతూ... "ఈ సినిమా నాకు ఆశ్వీర్వాదం మరియు శాపం కూడా. ఆ సినిమా నన్ను ప్రంపచ మ్యాప్ లో ఉంచి, ఎన్నో గొప్ప అవకాశాలు ఇప్పించింది. అయితే నేను ఇప్పటికి ఆ ఇమేజ్ నుంచి బయిటకు రాలేకపోతున్నా. నన్ను ఇప్పటికీ స్లమ్ డాగ్ మిలియనీర్ లో కుర్రాడు క్రిందే చూస్తున్నారు. నేను ఏ సినిమా చేసినా ఆ దృష్టి కోణంలోంచే చూసి విమర్శలు చేస్తున్నారు. ఆ సినిమా నాకు ఇప్పుడు సమస్యగా మారిపోయింది," అన్నాడు బాధగా దేవ్.

  పటేల్ కంటిన్యూ చేస్తూ.., "ఈ విషయం నాకు బాధగా ఉంది. మేమేమీ ఆస్కార్ కోసమో మరో దాని కోసమే ఈ సినిమా చేయలేదు. నాకు ఈ స్క్రిప్టు చదవగానే కన్నీరు వచ్చింది. నేను ఇదంతా నిజంగా ఎక్కడో జరిగిన కథే అనుకున్నాను. నేను ఆ సినిమా లో పాత్రను ప్రేమించాను. వాటితో పాటే ప్రయాణించాను. జీవించాను.అంతే ." అన్నారు దేవ్.

  ఈ సినిమా తర్వాత నేను చేసిన ప్రతీ సినిమా పైనా ఆ క్యారక్టర్ ఇంపాక్ట్ ఉంటోంది. ఆ సినిమాతో జనం పోల్చి చూస్తున్నారు. ఎలా దాన్నించి తప్పించుకోవాలో తెలియటం లేదు. అలాంటి పాత్రే ప్రతీ సారి చేయలేం కదా..ఆ పాత్రతో పోల్చి చూసి మాట్లాడితే నేను ఏం చేయగలను. అందుకే ఆ సినిమా నాకో శాపం కూడా అన్నారు దేవ్.

  Slumdog Millionaire Was Both A Blessing And A Curse For Dev Patel

  రీసెంట్ గా దేవ్ మరో గొప్ప సినిమాలో నటించాడు. 'స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌' తరహాలోనే ఇది కూడా ఆస్కార్‌ అవార్డుల్లో సంచలనాలు సృష్టిస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై.. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న ఆ సినిమా పేరు.. లయన్‌. ఇండియాలో చిన్నతనంలో తన తల్లికి దూరమైన ఓ కుర్రాడు.. అనుకోకుండా ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడే పెరిగి.. పాతికేళ్ల తర్వాత తన తల్లిని కలుసుకోవడం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఇది రియల్‌ స్టోరీ కావడం విశేషం.

  మధ్యప్రదేశ్‌కు చెందిన షేరూ మున్షి ఖాన్‌ అనే కుర్రాడు ఐదేళ్ల వయసులో రైల్లో తప్పిపోయి కోల్‌కతాకు చేరాడు. తిరిగి ఇంటికెళ్లే మార్గం తెలియక అక్కడే కొన్నాళ్లు అడుక్కుంటూ పొట్టనింపుకున్నాడు. తర్వాత ఓ వ్యక్తి సాయంతో అనాథాశ్రమంలో చేరాడు. అక్కణ్నుంచి అతణ్ని ఆస్ట్రేలియా దంపతులు దత్తత తీసుకుని తమ దేశానికి తీసుకెళ్లారు. వారి వద్దే పెరిగిన షేరూ పేరు.. సరూ బ్రియర్లీగా మారింది.

  అలాగే పెరిగి పెద్దయిన సరూకు సొంతగడ్డపై ప్రేమ మాత్రం చావలేదు. పెద్దయ్యాక వ్యాపారవేత్తగా ఎదిగిన సరూ.. తన తల్లిదండ్రుల్ని కలవాలని తపించాడు. తమ ఊరి పేరులో మొదటి అక్షరం మాత్రమే గుర్తుండటంతో గూగుల్‌ సాయంతో శోధించాడు. ఫేస్‌బుక్‌ గ్రూపుల్లో సాయం కోసం ప్రయత్నించాడు. మొత్తానికి ఎలాగోలా అతడి కల నెరవేరింది. పాతికేళ్ల తర్వాత మళ్లీ అతను అమ్మ ఒడికి చేరాడు.

  ఈ ప్రయాణాన్ని 'ఎ లాంగ్‌ వే హోమ్‌' అనే పుస్తకరూపంలోకి తెచ్చాడు. ఆ కథతోనే 'లయన్‌' సినిమా తెరకెక్కింది. ఈ కుర్రాడి పాత్రలో దేవ్‌ పటేల్‌ నటించగా.. అతడి ఆస్ట్రేలియా తల్లిగా ప్రముఖ హాలీవుడ్‌ నటి నికోల్‌ కిడ్‌మన్‌ కనిపించడం విశేషం. గర్థ్‌ డేవిస్‌ తెరకెక్కించిన ఈ చిత్రం తాజాగా టొరంటో ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శితమై.. ప్రశంసలందుకుంది. ఈ సినిమాకు ఆస్కార్‌ అవార్డు కూడా గ్యారెంటీ అనేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది.

  English summary
  British-Indian actor Dev Patel says that he feels his role in the much-acclaimed movie Slumdog Millionaire was like a blessing and also a curse to him. The 26-year-old star, who tasted fame with lead role in the Slumdog Millionaire, says while on one hand it has put him on the celebrity map in Hollywood, on the other hand it holds a lot of expectation from all around to prove himself that he belongs there.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X