»   » హాలీవుడ్‌ చిత్రంలో సోనూసూద్‌..కంగ్రాట్స్ చెప్పిన పూరి

హాలీవుడ్‌ చిత్రంలో సోనూసూద్‌..కంగ్రాట్స్ చెప్పిన పూరి

Posted By:
Subscribe to Filmibeat Telugu

దుబాయ్‌: తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు సోనూసూద్‌. ఇప్పుడు ఆయనకు హాలీవుడ్‌ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అందులోనూ ప్రముఖ హాలీవుడ్‌ నటుడు జాకీచాన్‌ హీరోగా నటిస్తున్న 'కూంగ్‌ఫూ యోగా' చిత్రంలో సోనూసూద్‌ నటించనున్నారు. ఈ విషయం విన్న పూరి జగన్నాథ్ ...శుభాకాంక్షలు తెలియచేస్తూ ట్వీట్ చేసారు.

జాకీచాన్‌ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'కుంగ్‌ ఫు యోగ'. స్టాన్లీ టంగ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాకీచాన్‌తో పాటు కలిసి నటించే కీలక పాత్రలో నటించనున్నాడు సోనూ. 'కుంగ్‌ ఫు యోగ' పూర్తి స్థాయి యాక్షన్‌ చిత్రం. జాకీచాన్‌ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రాల్లో ఒకటిగా నిలిచేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

Sonu Sood To Co-Star With Jackie Chan In 'Kung Fu Yoga'

ప్రస్తుతం దుబాయ్‌లో చిత్రీకరణ జరుపుకుంటోందీ చిత్రం. తర్వాత బీజింగ్‌తో పాటు ఇండియాలోనూ చిత్రీకరణ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సోనూకు ఇంత మంచి అవకాశం రావడం పట్ల బాలీవుడ్‌ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. షారూఖ్ ఖాన్ అయితే వెంటనే జాకీచాన్ ని కలవాలని అన్నారు. దానికి సోనూ రిప్లై ఇచ్చారు.

ఈ సందర్భంగా సోనూసూద్‌కి బాలీవుడ్‌ సినీ దర్శకురాలు ఫరాఖాన్‌ ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. తన స్నేహితుడు సోనూసూద్‌కి జాకీచాన్‌తో కలిసి నటించే అవకాశం రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

'బొమ్మాళీ.. నిన్నొదలా..'అంటూ 'అరుంధతి'లో పశుపతి పలికిన మాటలు మర్చిపోలేం. ఆ పాత్రను అద్భుతంగా పోషించిన నటుడు సోనూ సూద్‌. ప్రతినాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సోనూ తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ జోరుగానే ఉన్నాడు. ఇటీవలే 'హ్యాపీ న్యూ ఇయర్‌'తో మంచి విజయం అందుకున్నాడు. తాజాగా ఓ గొప్ప అవకాశం సోనూకు దక్కింది. త్వరలో జాకీచాన్‌తో కలిసి వెండితెరపై కనిపించబోతున్నాడు.

English summary
Sonu Sood is currently shooting for Jackie Chan's next big Hollywood film Kung Fu Yoga being directed by Stanley Tong. This out-and-out action film has our own Sonu, not just playing a role, but he plays parallel lead and will be shooting with Chan from start to finish.
Please Wait while comments are loading...