»   » కొత్త జేమ్స్‌ బాండ్‌ వచ్చేస్తున్నాడు!:విడుదల తేదీ ఇదిగో

కొత్త జేమ్స్‌ బాండ్‌ వచ్చేస్తున్నాడు!:విడుదల తేదీ ఇదిగో

Written By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్ : శామ్‌ మెండిస్‌ తెరకెక్కిస్తున్న 'స్పెక్టర్‌'లో బాండ్‌గా డేనియల్‌ క్రేగ్‌ నటించారు. మోనికా బెల్లూసీ, లీ సెడాక్స్‌, స్టీఫెనీ సిగ్మన్‌ బాండ్‌ భామలుగా కనిపిస్తారు. ఈ నెల 26న యూకేలో, వచ్చే నెల 6న అమెరికాలో, 20న మన దేశంలో చిత్రం విడుదలవుతుంది.

హాలీవుడ్ సిరీస్ జేమ్స్ బాండ్ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చివరి జేమ్స్ బాండ్ మూవీ ‘స్కై ఫాల్' 2012లో విడుదలైంది. ఇది జేమ్స్ బాండ్ సీరిస్ లో వచ్చిన 23వ సినిమా. ఇక 24వ జేమ్స్ బాండ్ సినిమా ‘స్పెక్టర్' త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

bond1

‘స్కై ఫాల్' చిత్రానికి దర్శకత్వం వహించిన సామ్ మెండెస్ మరోసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. కాసినో రాయల్(2006), క్వాంటమ్ ఆఫ్ సోలెస్(2008) , స్కైఫాల్(2012) చిత్రాల్లో నటించిన డేనియల్ క్రెగ్ నాలుగోసారి 007 ఏజెంట్ పాత్రలో నటిస్తున్నాడు. గత జేమ్స్ బాండ్ చిత్రాల్లో నటించిన ముఖ్య తారాగణం రాల్ఫ్ ఫిన్నెస్ ‘ఎం' పాత్రలో, నియోమీ హారిస్ ‘ఈవ్ మనీపెన్నీ', బెన్ వైషా ‘క్యూ' పాత్రల్లో నటించబోతున్నారు.


ఈ ట్రైలర్ లో డైలాగులు ,సీన్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంటున్నాయి...

విలన్‌ అడ్డాలోకి బాండ్‌ దర్జాగా ఎంటరయ్యాడు.
'ఎందుకొచ్చావ్‌ నువ్వు?'... నా ఇలాకాలోకి రావడానికి ఎంత ధైర్యం అన్న భావన విలన్‌ గొంతులో.
'నిన్ను చంపడానికి వచ్చా'. జేమ్స్‌ బాండ్‌ కళ్లలో చిలిపితనం. గొంతులో కరకుదనం.
'ఓహ్‌... చావడానికి వచ్చావనుకున్నానే'... వెటకారంతో కారం పూద్దామనుకున్నాడు.
కానీ అక్కడున్నది ఎవరు... బాండ్‌... జేమ్స్‌ బాండ్‌. కోటు జేబులో స్త్టెల్‌గా చేతులు పెట్టుకుని... కూల్‌గా నవ్వుతూనే రిటార్ట్‌ ఇచ్చాడు.

'బాధపడకు. మన మైండ్‌సెట్‌ను బట్టి కొన్ని అలా అర్థమవుతుంటాయ్‌!'
ఇదీ తాజా బాండ్‌ చిత్రం 'స్పెక్టర్‌' ట్రైలర్‌లోని సన్నివేశం.

bond2

బాండ్‌ సినిమా అనగానే అంచనాలు తారస్థాయిలో ఉంటాయి. వాటిని అందుకునేలా 'స్పెక్టర్‌' ఉంటుందని తాజా ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. గన్‌ ఫైరింగ్‌లు, కార్‌ ఛేజింగ్‌లే కాదు కూలిపోతున్న పెద్ద భవంతి నుంచి తప్పించుకోవడానికి బాండ్‌ చేసే సాహసం, బాండ్‌ నడుపుతున్న హెలికాప్టర్‌ గింగిరాలు తిరుగుతూ పడిపోవడం లాంటి దృశ్యాలు ట్రైలర్‌లో ఆసక్తి కలిగిస్తున్నాయి.

స్కైఫాల్ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించిన జాన్ లోగన్, నీల్ పర్విస్, రాబర్ట్ వాడ్ ఈ చిత్రానికి కూడా పని చేస్తున్నారు. గత జేమ్స్ బాండ్ చిత్రం ‘స్కై ఫాల్' ప్రపంచ వ్యాప్తంగా 1 బిలియన్‌ డాలర్లకు పైగా వసూలు చేసింది. ఈసారి వసూళ్లు మరింత ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.

అయితే సినిమాకు కొత్త చిక్కు వచ్చి పడింది... సోనీ పిక్చర్స్ కార్యాలయంలోని కంప్యూటర్లపై దాడి చేసిన హాకర్లు సినిమా స్క్రిప్ట్ గతేడాది దొంగిలించారు. ఈ స్క్రిప్టును బటకు లీక్ చేసారని సోనీ స్టూడియో ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే యూకే చట్టాల ప్రకారం స్క్రిప్ట్ కు కాపీరైట్ రక్షణ ఉందని, స్క్రిప్ట్ వివరాలు ప్రచురించినా, మరేదైనా చిత్రంలూ వాడినా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

English summary
Details of the 24th James Bond movie have been announced. It is scheduled to hit the theatres on 6 November 2015.
Please Wait while comments are loading...