»   » 'స్పెక్టర్‌' : ఈ సారి జేమ్స్‌ బాండ్‌ కి ఈ సెక్సీ భామే (వీడియో)

'స్పెక్టర్‌' : ఈ సారి జేమ్స్‌ బాండ్‌ కి ఈ సెక్సీ భామే (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్ : ప్రపంచ వ్యాప్తంగా జేమ్స్ బాండ్ ని తెలియని వారు ఉండరు. అందుకే బాండ్ చిత్రాల్లో కనిపించాలనేది చాలా మంది ఆర్టిస్టుల కోరిక. అందులోనూ ప్రధానపాత్ర జేమ్స్‌ బాండ్‌ సరసన నటించే అవకాశం కోసం చాలా పెద్ద పోటీ ఉంటుంది.

 ‘Spectre’ Preview Introduces Bond Girls Monica Bellucci

జీవితంలో ఒక్కసారైనా బాండ్‌ గర్ల్‌గా కనిపించాలన్నది హీరోయిన్స్ అందరి కల. తాజాగా ఇటాలియన్‌ సుందరి మోనికా బెల్లూసీకి ఆ కోరిక నెరవేరింది. ఈ విషయమై ఆమె చాలా సంతోషంగా ఉంది. ఈ విషయాన్ని ఆమె తాజాగా పంచుకున్న వీడియోలో చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

24వ జేమ్స్‌ బాండ్‌ చిత్రంగా వస్తున్న ఈ 'స్పెక్టర్‌'లో బాండ్‌ గర్ల్‌గా అవకాశం దక్కించుకుంది బెల్లూసీ. ఇందులో మరో హీరోయిన్ గా ఫ్రెంచ్‌ నటి లీ సెడాక్స్‌ కనిపించనుంది. 'స్పెక్టర్‌'లో అవకాశం రావడం పట్ల ఆనందం వ్యక్తం చేసింది బెల్లూసీ.

బెల్లూసీ మాట్లాడుతూ... ''ఈ చిత్రంలో లూసియా సియర్రా అనే మహిళగా నటిస్తున్నాను. ఆమె జీవితంలో ఎన్నో రహస్యాలుంటాయి. తన అందంతో జేమ్స్‌ బాండ్‌ను మాయ చేసే పాత్ర అది. జేమ్స్‌ బాండ్‌ చిత్రాలు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి. అలాంటి చిత్రంలో నేనూ భాగం కావడం సంతోషంగా ఉంది. ఇప్పటివరకూ బాండ్‌ గర్ల్స్‌గా నటించిన వారిపట్ల నాకు గౌరవముంది. వారు ఆ పాత్రలకు వన్నె తెచ్చారు''అని చెప్పింది బెల్లూసీ.

శామ్‌ మెండిస్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జేమ్స్‌ బాండ్‌గా డేనియల్‌ క్రేగ్‌ నటిస్తున్నాడు. నవంబరు 6న 'స్పెక్టర్‌' విడుదల కానుంది. హాలీవుడ్ సిరీస్ జేమ్స్ బాండ్ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చివరి జేమ్స్ బాండ్ మూవీ ‘స్కై ఫాల్' 2012లో విడుదలైంది. ఇది జేమ్స్ బాండ్ సీరిస్ లో వచ్చిన 23వ సినిమా. ఇక 24వ జేమ్స్ బాండ్ సినిమా ‘స్పెక్టర్' త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 ‘Spectre’ Preview Introduces Bond Girls Monica Bellucci

‘స్కై ఫాల్' చిత్రానికి దర్శకత్వం వహించిన సామ్ మెండెస్ మరోసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. కాసినో రాయల్(2006), క్వాంటమ్ ఆఫ్ సోలెస్(2008) , స్కైఫాల్(2012) చిత్రాల్లో నటించిన డేనియల్ క్రెగ్ నాలుగోసారి 007 ఏజెంట్ పాత్రలో నటిస్తున్నాడు. గత జేమ్స్ బాండ్ చిత్రాల్లో నటించిన ముఖ్య తారాగణం రాల్ఫ్ ఫిన్నెస్ ‘ఎం' పాత్రలో, నియోమీ హారిస్ ‘ఈవ్ మనీపెన్నీ', బెన్ వైషా ‘క్యూ' పాత్రల్లో నటించబోతున్నారు.

స్కైఫాల్ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించిన జాన్ లోగన్, నీల్ పర్విస్, రాబర్ట్ వాడ్ ఈ చిత్రానికి కూడా పని చేస్తున్నారు. గత జేమ్స్ బాండ్ చిత్రం ‘స్కై ఫాల్' ప్రపంచ వ్యాప్తంగా 1 బిలియన్‌ డాలర్లకు పైగా వసూలు చేసింది. ఈసారి వసూళ్లు మరింత ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.

అయితే సినిమాకు కొత్త చిక్కు వచ్చి పడింది... సోనీ పిక్చర్స్ కార్యాలయంలోని కంప్యూటర్లపై దాడి చేసిన హాకర్లు సినిమా స్క్రిప్ట్ గతేడాది దొంగిలించారు. ఈ స్క్రిప్టును బటకు లీక్ చేసారని సోనీ స్టూడియో ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే యూకే చట్టాల ప్రకారం స్క్రిప్ట్ కు కాపీరైట్ రక్షణ ఉందని, స్క్రిప్ట్ వివరాలు ప్రచురించినా, మరేదైనా చిత్రంలూ వాడినా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

English summary
A new video blog has arrived from the set of the latest James Bond adventure, introducing two of 007's new ladies. The latest vlog from the set of Spectre focuses on actresses Léa Seydoux and Monica Bellucci and the roles they play in the film. The sequel is once again directed by Sam Mendes. He continues the story he began with 2012's blockbuster hit Skyfall. And to keep pulses racing, he knew he needed to find a new pair of beauties to help James Bond along on his adventure. About these two new additions to the cast, he states the following.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu