twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'స్పైస్ గర్ల్స్' దుస్తులు చిన్న పిల్లల సేవా సంస్దలకు దానంగా..!

    By Nageswara Rao
    |

    లండన్, జూన్ 29: ఫేమస్ గర్ల్ బ్యాండ్ 'స్పైస్ గర్ల్స్' తమకున్న దుస్తుల్లో కొన్ని ఐకానిక్ డ్రస్సులను రెండు పిల్లల స్వచ్ఛంద సేవా సంస్థలకు దానంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంపై ఫేమస్ పుట్‌బాల్ ఆటగాడు డేవిడ్ బెకహాం భార్య ఒకప్పటి స్పైస్ గర్ల్ అయిన విక్టోరియా బెకహాం మాట్లాడుతూ నా వద్ద చాలా దుస్తులు ఉన్నాయి. నా కూతురు హార్పర్ చిన్న పిల్ల కాబట్టి తాను ఇంకా పెరిగి పెద్ద అవ్వడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి నా వద్ద ఉన్న దుస్తులను కొన్నింటిని హార్పర్ కోసం దాచి మిగిలిన వాటిని ఛారిటీకి ఇవ్వనున్నాను.

    మేము అందరం కలిసి ఇలా చిన్న పిల్లల ఛారిటీకి మా దుస్తులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. గతంలో స్పైస్ గర్ల్స్‌గా వ్యవహారించిన విక్టోరియా బెకహామ్, మెలనీ చిశోల్మ్, ఎమ్మా బున్టన్, గేరీ హాలీవెల్, మెలనీ బ్రౌన్ 2008 సంవత్సరం తర్వాత మొట్టమొదటి సారి అందరూ మంగళవారం కలుసుకున్న విషయం తెలిసిందే. వీరంతా సెయింట్ పాన్‌క్రాస్ రినయ్సెస్ హోటల్‌లో కొత్త స్టేజి షోని ప్రమోట్ చేసే భాగంలో కలుసుకున్నారు. 1998వ సంవత్సరంలో విడుదలైన సింగల్ ట్రాక్ మ్యూజిక్ వీడియో 'వన్నాబే' మాదిరి ఫోటోలకు మెట్లపై నుండి అభిమానులకు అభివాదం చేస్తూ ఫోజులిచ్చారు.

    అభిమానులు ఇక ఎమ్మా బుట్నన్ ధరించిన బేబి డాల్ దుస్తులు, మెలనీ చిశోల్మ్ యొక్క ట్రాక్ సూట్స్ మరియు మెలనీ బ్రౌన్ ధరించిన చిరుత పులి మచ్చలు కలిగిన క్యాట్ సూట్ వస్త్రాలను ఆక్షన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఐతే స్పైస్ గర్ల్‌లో దుస్తులలో బాగా ప్రాచుర్యం పొందిన హాల్లీ‌వెల్ యూనియన్ జ్యాక్ డ్రస్ మాత్రం వేలం పాటలో లేక పోవడం అభిమానులక ఒకింత నిరాశ.

    వీరందరూ ఇచ్చిన ఈ దుస్తులు త్వరలో గాలా ఈవెంట్లో వేలం పాట నిర్వహించనున్నారు. దీని ద్వారా వచ్చిన సొమ్ముని చిన్న పిల్లల సేవా సంస్దలు వాటి అవసరాలకు ఉపయోగించనున్నారు.

    తెలుగు వన్ఇండియా

    English summary
    Famous girl band Spice Girls are planning to donate some of their iconic costumes to two children’s charities.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X