మార్వెస్ సంస్థ నుంచి వచ్చే 'స్పైడర్ మ్యాన్' సిరీస్ చిత్రాలను ఇష్టపడే అభిమానులను సర్‌ప్రైజ్ నెక్ట్స్ ఇన్‌స్టాల్మెంట్ 'స్పైడర్-మ్యాన్: ఫార్ ఫ్రమ్ హోం' ట్రైలర్ విడుదలైంది. గత సిరీస్‌లో ఐన్ మ్యాన్ కూడా కనిపించాడు. అయితే తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే ఇందులో ఐరన్‌మ్యాన్ ఉండబోడని తెలుస్తోంది. అంతే కాదు... కొత్త విలన్‌తో పీటర్ పార్కర్ పోరాడబోతున్నాడు.
ఈ సారి స్పైడర్‌మ్యాన్ విన్యాసాలు యూరఫ్ నేపథ్యంలో సాగుతాయని తెలుస్తోంది. తన స్నేహితులతో కలిసి హాలిడే ట్రిప్ వెళ్లిన స్పైడర్‌మ్యాన్ తన స్నేహితులను కాపాడటానికి చేసే స్టైంట్స్ ప్రేక్షకులను అబ్బుర పరచనున్నాయి.
కెప్టెన్ అమెరికా-సివిల్ వార్, స్పైడర్‌మ్యాన్-హోమ్ కమింగ్ చిత్రాల్లో పీటర్ పార్కర్ పాత్రలో నటించిన టామ్ హోలాండ్ తాజా సిరీస్‌లోనూ స్పైడర్ మ్యాన్‌గా ప్రేక్షకులు అలరించబోతున్నాడు. శామ్యూల్ ఎల్ జాక్సన్, జెందయా, స్లమ్‌డర్స్, జాన్ ఫెవరివ్, స్మూమీ, జాకబ్ బాట్లన్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
గత సినిమాల కంటే ది బెస్ట్ అనేలా యాక్షన్ సీన్లు డిజైన్ చేశాడు దర్శకుడు జాన్ వాట్స్. కొలంబియా పిక్చర్స్, మార్వెల్ స్టూడియో సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని సోనీ సంస్థ జులై 5న అమెరికాలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. భారతీయ భాషల్లో సైతం ఈ మూవీ విడుదల కానుంది.
Spider-man: Far From Home trailer just dropped and we have to say that besides ruining the obvious result of Avengers: Endgame it did raise a few questions too. From what we can see, Mysterio isn't alone. Like who are those villains that are controlling the elements.
Story first published: Wednesday, January 16, 2019, 11:25 [IST]