»   » ఫస్ట్ అఫీషయిల్ ట్రైలర్.... ‘స్పైడర్ మ్యాన్: హోమ్ కమింగ్’

ఫస్ట్ అఫీషయిల్ ట్రైలర్.... ‘స్పైడర్ మ్యాన్: హోమ్ కమింగ్’

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: స్పైడర్ మ్యాన్ సిరీస్ చిత్రాల అభిమానులకు శుభవార్త. త్వరలో మరో సిరీస్ రాబోతోంది. 'స్పైడర్ మ్యాన్: హోమ్ కమింగ్' పేరుతో రాబోతున్న ఈ చిత్రం ఫస్ట్ అఫీషియల్ ట్రైలర్ తాజాగా రిలీజ్ చేసారు.

జాన్ వాట్స్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం గత సిరీస్ చిత్రాల కంటే అద్భుతమైన విన్యాసాలతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించబోతోంది. ఇందులో స్పైడర్ మేన్ పాత్రలో 20 ఏళ్ల వయసున్న టామ్ హాలండ్.... పీటర్ పార్కర్/స్పైడర్ మేన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇంతకు ముందు టామ్ హాలండ్ ది హార్ట్ ఆఫ్ ది సీ, కెప్టెన్ అమెరికా-సివిల్ వార్ చిత్రాల్లో నటించాడు.

వీరితో పాటు 'ఐరన్‌మ్యాన్' ఫేం, హాలీవుడ్ స్టార్ రాబర్ట్ డౌనీ జూనియర్ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ కు రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంది.

హాలీవుడ్లో ప్రముఖ నిర్మాణ సంస్థలైన మార్వెల్ స్టూడియోస్, కొలంబియా పిక్చర్స్ వారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సోనీ పిక్చర్స్ సంస్థ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది.

English summary
Spider-Man : Homecoming is an upcoming American film. It features the Marvel Comics character Spider-Man, produced by Columbia Pictures and Marvel Studios, and distributed by Sony Pictures. Marvel Studios and Sony have reached a deal to share the character rights of Spider-Man. The movie is scheduled to be released on July 7, 2017 in the United States in 3D, IMAX, and IMAX 3D.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu