twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Spider Man: No Way Home ఫ్యాన్స్‌లో హై ఫీవర్, టికెట్ ధర 2200.. ఫ్యాన్స్ క్రేజ్‌తో వెబ్‌సైట్స్ క్రాష్

    |

    ప్రపంచ బాక్సాఫీస్‌కు జోష్ తెచ్చిన సినిమా ఏదైనా రాబోతున్నదంటే.. అది స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ సినిమా అనే చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే కోవిడ్ పరిస్థితుల మధ్య ఎన్నడూ లేనంతగా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా వరల్డ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. డిసెంబర్ 16న ఈ సినిమా ప్రభంజనం మొదలు కాబోతున్నది. ఈ సినిమాపై పెరిగిన అంచనాల విషయంలోకి వెళితే..

    బాక్సాఫీస్ రికార్డుల హోరు..

    బాక్సాఫీస్ రికార్డుల హోరు..


    2021 ఏడాదిలో అతిపెద్ద మార్వెల్ సినిమాగా చరిత్రకెక్కనున్న Spider Man: No Way Home చిత్రం భారతీయ బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడానికి సిద్ధంగా ఉంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‌‌కు భారీ స్పందన కనిపిస్తున్నది. హాలీవుడ్ సినిమాలకు భారత్ అతిపెద్ద మార్కెట్ అనే విషయాన్ని మరోసారి ప్రేక్షకులు రుజువు చేశారు.

    ఒకరోజు ముందుగానే ఇండియాలో..

    ఒకరోజు ముందుగానే ఇండియాలో..

    Spider Man: No Way Home చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 17వ తేదీన రిలీజ్ అవుతున్నది. భారత్‌లో మార్వెల్ సినిమాలకు ఉన్న క్రేజ్‌ను బట్టి ఒక రోజు ముందుగానే ఈ సినిమాను అంటే డిసెంబర్ 16వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. గత రెండు రోజుల క్రితం ప్రారంభమైన అడ్వాన్స్ బుకింగ్‌కు అభిమానులు పోటెత్తారు.

    ఉదయం 4 గంటలకే తొలి షో

    ఉదయం 4 గంటలకే తొలి షో

    ఇదిలా ఉండగా, Spider Man: No Way Home సినిమా ఓ ప్రత్యేకతను, విశేషతను సొంతం చేసుకొన్నది. ముంబైలో ఈ సినిమాను తెల్లవారుజామున 4 గంటలకే ప్రదర్శించేందుకు సిద్దమయ్యారు. ఇక థానే పట్టణంలో తెల్లవారుజామున 5 గంటలకు తొలి ఆటను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో ఉదయమే ఈ సినిమాను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు.

    ఫ్యాన్స్ పోటెత్తడంతో వెబ్‌సైట్లు క్రాష్

    ఫ్యాన్స్ పోటెత్తడంతో వెబ్‌సైట్లు క్రాష్

    Spider Man: No Way Home సినిమా అడ్వాన్స్ బుకింగ్‌‌కు ఎన్నడూలేని విధంగా స్పందన కనిపించింది. అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాగానే అభిమానులు పోటెత్తడంతో టికెట్ బుకింగ్ వెబ్‌సైట్లు క్రాష్ అయ్యాయి. ఫ్యాన్స్ తాకిడిని భరించలేక వెబ్‌సైట్లు మొరాయించాయి. దాంతో ఈ సినిమాపై సినీ ప్రేక్షకులకు ఎంత క్రేజ్ ఉందో స్పష్టమైంది.

    95 శాతం అడ్వాన్స్ బుకింగ్

    95 శాతం అడ్వాన్స్ బుకింగ్

    Spider Man: No Way Home చిత్రం ఇటీవల కాలంలో ఏ విదేశీ సినిమా చేసుకొని ఘనతను ఈ చిత్రం సొంతం చేసుకొన్నది. అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైన వెంటనే దాదాపు 90 శాతం టికెట్లు అమ్ముడుపోయాయి. దక్షిణ భారతంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ పరిస్థితి కనిపించింది. దేశంలోని పలు నగరాల్లో దాదాపు టికెట్లు అన్నీ అమ్ముడుపోయాయి. హైదరాబాద్‌లో దాదాపు 95 శాతం టికెట్లను ప్రేక్షకులు బుక్ చేసుకొన్నారు.

    టికెట్ ధర 2200.. రికార్డు దిశగా..

    టికెట్ ధర 2200.. రికార్డు దిశగా..

    Spider Man: No Way Home చిత్రం విడుదలకు ముందే మరో రికార్డును సొంతం చేసుకొన్నది. ఈ సినిమా టికెట్ హయ్యెస్ట్ ధర 2200 రూపాయలు. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‌లు పూర్తి అయ్యాయి. సినీ ప్రేక్షకులు ఖర్చుకు వెనుకాడకుండా టికెట్లను కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు అంటూ ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

    English summary
    Most awaited Marvel movie Spider Man: No Way Home set to release This movie sets box office on fire, Ticket price is recorded as Rs.2200.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X