Squid Game అవార్టుల పంట పండించబోతున్న సంచలన వెబ్ సిరీస్.. అమెరికాలో అన్ని అవార్డులపై..
ఓవర్ ది టాప్ (ఓటీటీ) చరిత్రలో స్క్విడ్ గేమ్ షో అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నది. అత్యంత ప్రజాదరణ పొందిన ఓటీటీ ఫ్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ఈ చిత్రం సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నది. స్ట్రీమింగ్ హిస్టరీలోనే మెగా హిట్‌గా నిలిచింది
దక్షిణ కొరియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతున్న స్కిడ్ గేమ్ చిత్రం అవార్డుల పంట పండించబోతున్నది. అమెరికాలో ఈ సంవత్సరం చివరన జరిగే అవార్డుల ఫంక్షన్లో పలు కేటగిరిల్లో ఈ చిత్రం నామినేట్ కావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. టెవీ సిరీస్ విభాగంలో పలు అవార్డులను స్క్విడ్ గేమ్ దక్కించుకోవడం ఖాయమనే విషయాన్ని సినీ విమర్శకులు చెబుతున్నారు.

అమెరికాలోని వినోద పరిశ్రమలో జరిగే అవార్డుల ఫంక్షన్‌లో స్క్విడ్ గేమ్ భారీగా అవార్డులు గెలుచుకోబోతున్నది. అంతేకాకుండా ఎమ్మీ, ఆస్కార్ అవార్డులపై కూడా ఈ సినిమా కన్నేసింది అని మీడియా కథనాలు సంచలన రీతిలో వెల్లడయ్యాయి.
స్క్విడ్ గేమ్ రిలీజ్‌కు ముందే అత్యంత పాపులారిటీని సొంతం చేసుకొన్నది. అతి తక్కువ బడ్జెట్‌తో రూపొందిన షో భారీ బిజినెస్ చేసింది. ఈ షో రిలీజ్‌కు ముందు నిర్వహించిన క్విజ్ పోటీలు సౌత్ కోరియాకు చెందిన ఈ షోకు 891.1 మిలియన్ డాలర్ల విలువను తెచ్చిపెట్టింది. ఈ షోకు సంబంధించిన ఎపిసోడ్‌కు అయిన ఖర్చు కేవలం 2.4 మిలియన్ డాలర్లు. ఈ షో మొత్తం ఖర్చు 21..4 మిలియన్ డాలర్లుగా ట్రేడ్ వర్గాలు లెక్కకట్టాయి.


Click it and Unblock the Notifications











