సైన్స్‌ ఫిక్షన్‌ స్టార్‌ ట్రెక్‌-3..దర్శకుడు ఖరారు

By Srikanya

లాస్ ఏంజిల్స్ : ప్రపంచ సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'స్టార్‌ ట్రాక్‌-3' దర్శకుడు ఎవరనే విషయంపై ఓ క్లారిటీ వచ్చింది. ఇంగ్లీష్‌ రచయిత, దర్శకుడు జో కార్నిష్‌, పారమౌంట్‌ స్టూడియో నిర్మించే 'స్టార్‌ ట్రాక్‌-3' సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. జె.జె. అబ్రహం డిస్నీ చిత్రం 'స్టార్‌ వార్‌-7' చిత్రీకరణలో బిజీగా ఉండటంతో జో కార్నిష్‌కి అవకాశం దక్కింది. గతంలో వచ్చిన 'స్టార్‌ ట్రెక్‌' చిత్రానికి, దాని సీక్వెల్‌ 'స్టార్‌ ట్రెక్‌ ఇన్‌ టు డార్క్‌నెస్‌'కి కూడా అబ్రహాం దర్శకుడు.

Star Trek 3 aims to beam up Joe Cornish

'అటాక్‌ ది బ్లాక్‌' అనే సైంటిఫిక్‌ ఫిక్షన్‌ సినిమాని తక్కువ బడ్జెట్‌లో తీసి విజయవంతం చేసినందుకు ఇప్పుడు జోకి అవకాశం దొరికింది. ఈ చిత్రం 2014 వేసవిలో సెట్స్‌కి వెళ్లనుంది. 'స్టార్‌ ట్రెక్‌' సిరీస్‌ ఎంత పాపులర్‌ అంటే టీవీ ప్రసారాలు జరిగినప్పుడు ఈ చిత్ర అభిమానుల్ని 'ట్రెక్కీస్‌' అని పిలిచేవారు.

ఇక 'స్టార్‌ట్రెక్‌' మీద ఎన్నో పేరడీలు వచ్చాయి. ఈ సైంటిఫిక్‌ చిత్రం ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. మనం ఇప్పుడు వాడుతున్న 'మొబైల్‌ సెల్‌ ఫోన్‌' ఆవిర్భావం ఈ చిత్రస్ఫూర్తితోనే అని తెలిస్తే ఆశ్చర్యపోతారు. కొత్త చిత్రం ఎలా ఉంటుందో 'ట్రెక్కీస్‌' అప్పుడే అంచనాలు వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X