»   » ట్రైలర్ అద్భుతం: ప్రపంచంలో సినిమాలన్నీ దీని కింద దిగదుడుపే..!

ట్రైలర్ అద్భుతం: ప్రపంచంలో సినిమాలన్నీ దీని కింద దిగదుడుపే..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఇప్పటి వరకు ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. ఇప్పటి వరకు వచ్చిన వాటిలో అద్భుతమైన సినిమా 'అవతార్' అని చాలా మంది అభిప్రాయం. అయితే ఈ డిసెంబర్లో విడుదల కాబోయే 'స్టార్‌ వార్స్‌.. ద లాస్ట్‌ జేడీ' సినిమా తర్వాత చాలా మంది అభిప్రాయాలు మారిపోతాయేమో?

హాలీవుడ్ సినిమాలను ఇష్టపడే వారిని 2015లో వచ్చిన 'స్టార్‌ వార్స్‌- ద ఫోర్స్‌ అవాకెన్స్‌' చిత్రం ఎంతగానో ఆకట్టుకుంది. దానికి సీక్వెల్ 'స్టార్‌ వార్స్‌- ద లాస్ట్‌ జేడీ'. ఈ సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారిని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ట్రైలర్‌ సోమవారం విడుదలైంది.

అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్

అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్

ట్రైలర్ చూసిన వారు ఈ సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ట్రైలర్ ఈ రేంజిలో ఉందంటే రేపు సినిమా ఏ స్థాయిలో ఉంటుందో అని అంచనాలు భారీగా పెంచేసుకుంటున్నారు.

ముఖ్య తారాగణం

ముఖ్య తారాగణం

ఈ చిత్రంలో మార్క్‌ హామిల్‌, క్యారీ ఫిషర్‌, ఆడమ్‌ డ్రైవర్‌; డైసీ రిడ్లే, జాన్‌ బోయోగా, ఆస్కార్‌, ఇసాక్‌, ఆండీ సెర్కిస్‌ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు.

యాక్షన్, డ్రామా

యాక్షన్, డ్రామా

ఏదో కేవలం విజువల్ ఎఫెక్ట్స్ మాత్రమే కాదు. యాక్షన్, డ్రామా కూడా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనుంది. ఈ ట్రైలర్ చూసిన సినీ ప్రముఖులు సైతం అద్భుతం అంటూ ప్రశంసిస్తున్నారు. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంది.

భారీ విడుదల

భారీ విడుదల

డిసెంబర్లో వచ్చే క్రిస్ మస్ సీజన్ ను టార్గెట్ చేస్తూ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వేలాది థియేటర్లలో ఈ చిత్రం డిసెంబర్‌ 15న విడుదల కాబోతోంది.

ట్రైలర్ ఇదే...

ట్రైలర్ ఇదే...

English summary
Watch the new trailer for Star Wars: The Last Jedi and see it in theaters December 15.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu