twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టార్ డైరక్టర్ స్పీల్‌బర్గ్‌కి నిరాశే

    By Srikanya
    |

    లాస్ ఏంజిల్స్‌ : వైభవంగా జరిగిన 85వ ఆస్కార్ అవార్డ్ వేడుకలో భారతీయ కథా నేపథ్యంలో రూపొందిన 'లైఫ్ ఆఫ్ పై' నాలుగు ఆస్కార్లను సొంతం చేసుకుంది. స్పీల్‌బర్గ్‌కి మాత్రం పూర్తి నిరాశను మిగిల్చింది. ఆయన డైరక్ట్ చేసిన 'లింకన్‌' చిత్రం మొత్తం 12 విభాగాల్లో నామినేషన్‌ దక్కించుకొన్న విషయం తెలిసిందే. అయితే రెండు విభాగాల్లో మాత్రమే అవార్డులు దక్కాయి. ఉత్తమ దర్శకుడిగా స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ పురస్కారం దక్కించుకోవడం ఖాయమని ఊహించారు. అయితే ఆంగ్‌ లీకి దక్కింది.

    ఉత్తమ నటుడిగా 'లింకన్‌' చిత్రంలో నటించిన డేనియల్‌ డే లెవిస్‌ ఎంపికయ్యారు. అదొక్కటే ఊరట. డేనియల్ డే లూయిస్ మాట్లాడుతూ.. లింకన్‌గా ఒదిగిపోవడం సులువైన విషయం కాదు. ఒకవేళ ఆ పాత్రపోషణలో నేను ఫెయిల్ అయ్యుంటే ఈ దేశానికి నా మొహం చూపించలేకపోయేవాడ్ని. ఇక ఇప్పట్లో చరిత్రాత్మక పాత్రలు చేయను. కొన్నేళ్ల పాటు విశ్రాంతి తీసుకోవాలనిపిస్తోంది. ఇలాంటి పాత్ర చేయాలనే ఆలోచనను దరిదాపుల్లోకి కూడా రానివ్వను. లింకన్ పాత్రలో గడ్డంతో కనిపించాను. అది పెట్టుడు గడ్డం అని చాలామంది అనుకుంటున్నారు. అది పూర్తిగా నా సొంత గడ్డమే అన్నారు.

    ఇక స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'లింకన్‌'. యూఎస్‌లో బానిసత్వాన్ని రూపుమాపేందుకు రాజ్యాంగంలో పదమూడో చట్ట సవరణ చేసేందుకు లింకన్‌ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడనే కథాంశంతో తెరకెక్కింది. స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌, కాథలీన్‌ కెన్నడీ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ ఏడాది ఉత్తమ దర్శకుడి విభాగంలో నామినేషన్‌ దక్కించుకోవడంతో కలిపి స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌కి ఇది పదిహేనో ఆస్కార్‌ నామినేషన్‌.

    ఇక ప్రొడక్షన్‌ డిజైన్‌ విభాగంలో రిక్‌ కార్టర్‌ (ప్రొడక్షన్‌ డిజైన్‌), జిమ్‌ ఎరిక్సన్‌ (సెట్‌ డెకరేషన్‌) అవార్డు పొందారు. ఉత్తమ చిత్రంగా ఎంపికైన 'ఆర్గో' సినిమాకు ఉత్తమ కూర్పు (విలియమ్‌ గోల్డెన్‌బర్గ్‌), ఉత్తమ రచన - అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే (క్రిస్‌ టెర్రియో) విభాగాల్లో పురస్కారాలు వచ్చాయి. ఉత్తమ నటి విభాగంలో 'సిల్వర్‌ లైనింగ్స్‌ ప్లేబుక్‌' చిత్రానికిగానూ జెన్నిఫర్‌ లారెన్స్‌ ఎంపికైంది. ఉత్తమ చిత్రంగా 'ఆర్గో' చిత్రాన్ని ప్రకటించేందుకు అమెరికా ప్రథమ మహిళ మిఛెల్‌ ఒబామా... వైట్‌ హౌస్‌ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా కనిపించారు. సహాయ నటుడుగా క్రిస్టోఫర్‌ వాల్జ్‌ (ది జాంగో అన్‌చైన్డ్‌), సహాయ నటిగా అన్నే హాథవే (లెస్‌ మిజరబుల్స్‌) ఆస్కార్‌ ప్రతిమల్ని ముద్దాడారు. యానిమేషన్‌ చిత్రంగా బ్రేవ్‌ (మార్క్‌ ఆండ్రూస్‌, బ్రెండా చాంప్‌మ్యాన్‌), విదేశీ చిత్రంగా అమోర్‌ (ఆస్ట్రియా) నిలిచాయి.

    English summary
    "Lincoln," with only two victories for its 12 nominations. This was a different kind of film for Steven Spielberg, a film whose pleasures were restrained, interior and subtle, a film in which the director placed himself at the service of the script and the acting, not his own reputation.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X