»   » స్టీవెన్ స్పీల్‌బర్గ్ మూవీ 'ది బిఎఫ్‌జి' (తెలుగు ట్రైలర్)

స్టీవెన్ స్పీల్‌బర్గ్ మూవీ 'ది బిఎఫ్‌జి' (తెలుగు ట్రైలర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ స్టీవెన్ స్పీల్ బర్గ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనుకుంటా.... జురాసిక్ పార్క్, జాస్, ఇండియానా జోన్స్ వంటి అద్భుతమైన చిత్రాల ప్రపంచానికి అందించిన ఆయన గురించి తెలియని సినీ ప్రేమికులు ఉండరంటే అతిశయోక్తి కాదు.

తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ఫాంటసి అడ్వంచర్ చిత్రం " ది బి ఎఫ్ జి (ది బిగ్ ఫ్రెండ్లీ జయంట్)". 1982లో రోల్డ్ డాల్ రచించిన నవల ఆధారంగా అదే పేరుతో ఈ సినిమాను తెరకెక్కించారు. డిస్నీ మరియు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని జులై 15 న దేశ వ్యాప్తంగా రిలయన్స్ వారు విడుదల చేయనున్నారు.

ప్రముఖ తెలుగు నటుడు జగపతి బాబు ఈ చిత్రం లో ని ప్రధాన పాత్రకు డబ్బింగ్ చెప్పటం విశేషం. ఆయన ఒక పాత్రకు డబ్బింగ్ చెప్పటం ఇదే ప్రధమం. ఒక ఫ్రెండ్లీ మహాకాయుడికి ఒక చిన్న పిల్లకి మధ్య జరిగే ఒక కథను స్టీవెన్ స్పీల్ బర్గ్ అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం తో తెరకెక్కించారు.

140 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం జులై 1న అమెరికాలో విడుదలైంది. స్పీల్ బర్గ్ కు ఉన్న పాపులారిటీతో ఓపెనింగ్స్ అదిరిపోతాయని భావించారు. అయితే ఓపెనింగ్స్ పరంగా సినిమా ఆశించిన ఫలితాలు దక్కలేదు.

English summary
The BFG is a 2016 American fantasy adventure film directed and produced by Steven Spielberg and written by Melissa Mathison, based on the 1982 novel of the same name by Roald Dahl. The film stars Mark Rylance, Ruby Barnhill, Penelope Wilton, Jemaine Clement, Rebecca Hall, Rafe Spall and Bill Hader.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu