»   » స్టూడియో హెడ్ నన్ను రేప్ చేసాడు, అందుకే కేసు పెట్టలేదు: నటి ప్రకటన

స్టూడియో హెడ్ నన్ను రేప్ చేసాడు, అందుకే కేసు పెట్టలేదు: నటి ప్రకటన

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ఏంజిల్స్: సినీరంగంలోకి వచ్చిన నటీమణులపై కొన్ని సందర్భాల్లో లైంగిక దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. నిర్మాతలు, దర్శకులు, కొన్ని సందర్భాల్లో హీరోలు వారిని శారీరకంగా లొంగదీసుకున్న సందర్భాలెన్నో.

ఏవో కొన్ని తప్ప చాలా వరకు ఇలాంటి ఘటనలు బయటకు రావడం లేదు. బయట పడితే కెరీర్ స్పాయిల్ అవుతుందనో, అవకాశాలు తగ్గిపోతాయనే, నలుగురిలో నవ్వుల పాలవుతామనో భయంతో తమలో తామేకుమిలి పోతున్నారు.

అయితే ఏదో ఒక సందర్భంలో ఇలాంటి విషయాలు బయటకు వస్తాయి. తాజాగా హాలీవుడ్ నటి రోస్ మెక్‌గోవన్ తనపై రేప్ జరిగిన విషయాన్ని బయట పెట్టింది.

స్టూడియో హెడ్ రేప్ చేసాడు

స్టూడియో హెడ్ రేప్ చేసాడు

స్టూడియో హెడ్ తనపై లైంగిక దాడి జరిపాడని, తనకు ఇష్టం లేకున్నా బలవంతంగా తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని రోజ్ మెక్‌గోవన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. అయితే ఆ స్టూడియో పేరుగానీ, అతని వివరాలు కానీ రోజ్ బయట పెట్టలేదు.

అందుకే కేసు పెట్టలేదు

అందుకే కేసు పెట్టలేదు

అతనపై అత్యాచారం జరిగిన వెంటనే అతడిపై కేసు పెట్టేందుకు, న్యాయ పోరాటం సాగించాలని నిర్ణయించుకున్నాను. కానీ లాయర్ ఈ కేసు మీరు ఎప్పటికీ గెలవలేరు అని చెప్పడంతో మిన్నకుండి పోయాను అని ఆమె తన ఆవేదనను బయట పెట్టారు.

నేను శృంగార సీన్లలో నటించడం వల్లనే

గతంలో నేను ఓ సినిమాలో సెక్స్ సీన్ చేసారు. ఆ కారణంగా తాను ఎప్పటికీ కేసు గెలవలేనని లాయర్ సలహా ఇచ్చారు. అయితే తనపై రేప్ జరిగిన విషయం హాలీవుడ్ లో అందరికీ తెలుసు అని రోజ్ మెక్‌గోవన్ తెలిపారు.

డియర్ హాలీవుడ్ అంటూ..

డియర్ హాలీవుడ్ అంటూ రోజ్ మెక్‌గోవన్ సందేశం

English summary
Grindhouse actor Rose McGowan has said she was raped by an unnamed “studio head” and that a lawyer advised her she “would never win” a criminal case. Tweeting under the hashtag #WhyWomenDontReport, McGowan started a series of posts suggesting that “because I’d done a sex scene in a film”, any prospective legal action would fail.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu