»   » ఈ నెల్లోనే... 'మ్యాన్ ఆఫ్ స్టీల్' ('సూపర్‌మేన్')

ఈ నెల్లోనే... 'మ్యాన్ ఆఫ్ స్టీల్' ('సూపర్‌మేన్')

Posted By:
Subscribe to Filmibeat Telugu
Man of Steel
లాస్ ఏంజిల్స్ : సూపర్ మ్యాన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'మ్యాన్ ఆఫ్ స్టీల్' . దాదాపు వెయ్యి కోట్ల రూపాయల భారీ వ్యయంతో హాలీవుడ్‌లో రూపొందిన 'మ్యాన్ ఆఫ్ స్టీల్' సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 14న విడుదలవుతోంది. సూపర్‌మేన్ సీరిస్ మొదలై 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రూపొందిన ఈ చిత్రానికి '300' ఫేమ్ జాక్ స్నైడర్ దర్శకుడు.

చిత్ర కథేమిటంటే.... ఈ చిత్రంలో క్రిప్టన్ గ్రహంలో పుట్టి భూమ్మీద పెరిగిన సూపర్‌మేన్ తనకున్న అపూర్వ శక్తుల్ని తెలుసుకునేలోపే గ్రహాంతరవాసులు భూమ్మీదకు వస్తారు. అతడి శక్తుల్ని ప్రపంచ వినాశనానికి వినియోగించాలని చూస్తారు. అది తెలుసుకున్న సూపర్‌మేన్ తన ప్రజల్నీ, ఈ ప్రపంచాన్నీ ఎలా కాపాడాడన్నది మిగతా కథ .


ఈ చిత్రంలో క్షణంలో అంతరిక్షాలకు ఎగరడం, భూమికీ, ఆకాశానికీ మధ్య యుద్ధాలు చేయడం వంటి ప్రేక్షకుల అంచనాలకు అందని రీతిలో అపూర్వ శక్తులతో సూపర్‌మేన్ అలరిస్తాడు. సూపర్‌మేన్‌గా హెన్రీ కావిల్ నటించిన అమీ ఆడమ్స్, మైఖేల్ షానన్, డియాన్ లేన్, కెవిన్ కాస్టనర్, లారెన్స్ ఫిష్‌బర్న్, రస్సెల్ క్రోవ్ ప్రధాన పాత్రధారులు.


ఈ చిత్రాన్ని తెలుగులో 'సూపర్‌మేన్' పేరుతో సెన్సేషనల్ మూవీస్ పతాకంపై గోగినేని బాలకృష్ణ విడుదల చేస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని 2డి, 3డి వెర్షన్‌లతో పాటు ఐమాక్స్ 3డి వెర్షన్‌లోనూ విడుదల చేస్తున్నారు.

English summary

 As the Superman series has completed 75 years, a film is coming in this series, which is titled as 'Superman : Man of Steel'. The film will release on 14th of this month, worldwide.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu