»   »  'లైఫ్‌ ఆఫ్‌ పై' లో హీరో భారతీయ కుర్రాడు..ఎంపిక ఎలాగంటే

'లైఫ్‌ ఆఫ్‌ పై' లో హీరో భారతీయ కుర్రాడు..ఎంపిక ఎలాగంటే

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  లాస్ ఏంజిల్స్ : సుప్రసిద్ధ హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ 'ట్వంటీయత్‌ సెంచరీ ఫాక్స్‌' భారీ వ్యయంతో నిర్మించిన 'లైఫ్‌ ఆఫ్‌ పై' చిత్రం నవంబర్‌ 23న ఫాక్స్‌ స్టార్‌ మూవీస్‌ ద్వారా 2డి, 3డిలలో విడుదలకు సిద్ధంగా ఉంది. హిందీ, తెలుగు, ఇంగ్లీష్‌ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 2001లో యామ్‌ మార్టెన్‌ రచించిన నవల ఆధారంగా దీనిని రూపొందించారు. ఈ చిత్రంలో ప్రధానపాత్రను సూరజ్‌ శర్మ ని పోషించారు. 'క్రౌంచింగ్‌ టైగర్‌ హిడెన్‌ డ్రాగన్‌' చిత్రానికి పలు ఆస్కార్‌లను స్వంతం చేసుకున్న ఆంగ్‌ లీ దృష్టిలో ఈ డిల్లీ కుర్రాడు ఎలా పడ్డాడూ అంటే ఓ సారి ప్లాష్ బ్యాక్ లోకి వెళ్లాల్సిందే.

  జీవితాన్ని హాయిగా ఆస్వాదిస్తూ 12వ తరగతి చదువుతున్న 16 సంవత్సరాల పిల్లవాడు డిల్లీ నగరానికి చెందిన సూరజ్‌ శర్మ. తన సోదరుడు శ్రీహర్ష శర్మ ఏదో సినిమాకు నటులను ఎంపిక చేసే (ఆడిషన్‌) కార్యక్రమానికి హాజరవుతుంటే ఆ అబ్బాయికి తోడుగా సూరజ్‌ కూడా వెళ్ళాడు. ఎంతో ఆశతో వెళ్ళిన శ్రీహర్షనే కాదు... ఆ సినిమాలో అవకాశం కోసం వెళ్ళిన దాదాపు మూడు వేల మందిలో ఎవరూ దానికి సరిపోరని దర్శకుడు తిరస్కరించాడు. అనూహ్యంగా ఆ పాత్రకు సూరజ్‌ సరిగ్గా సరిపోతాడని ఆ చిత్ర బృందం అనుకోవడమే కాకుండా నువ్వే నటించాలని ముక్త కంఠంతో చెప్పారు.

  నిజానికి సూరజ్‌కు నటించాలన్న కోరిక అప్పటివరకు లేదు. నటనలో ఏ విధమైన అనుభవం కూడా లేదు. జీవితంలో ఎప్పుడూ కెమెరా ఎదురుగా నిలబడలేదు కూడా. అదీకాకుండా ఓ వైపు 12వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరు కావాలి. తల్లిదండ్రులిద్దరూ ఐ.ఐ.టి.లో చదువుకున్న విద్యావంతులే కావడంతో సంవత్సరం చదువును ఆపి సినిమాలో నటించడానికి వారు సుతరామూ ఇష్టపడలేదు. ఈ సినిమాలో తాను నటించనని వెనుదిరగడానికి సూరజ్‌కు మనసొప్పలేదు. అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చే సినిమా ఇది. అదీ కాకుండా ఆ సినిమాకు దర్శకుడు ఆస్కార్‌ పురస్కార గ్రహీత (క్రౌంచింగ్‌ టైగర్‌ - హిడన్‌ డ్రాగన్‌) అయిన ఆంగ్‌ లీ.

  సినిమా ఇతివృత్తం బుక్కర్‌ ప్రైజ్‌ను గెలుచుకున్న నవల 'లైఫ్‌ ఆఫ్‌ పై', రచయిత యాన్‌ మార్టెల్‌ అయితే ఆ సినిమాను నిర్మిస్తున్నది ట్వంటియత్‌ సెంచరీ ఫాక్స్‌ సంస్ధ. ఇక త్రీడిలో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాలో ఆయన సహనటులైతే బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌కు పరిచయమున్న టాబు, ఇర్ఫాన్‌ఖాన్‌లు. ఇన్ని సకారాత్మక కారణాలున్న ఈ చిత్రంలో నటించడానికి సూరజ్‌ మొగ్గుచూపిన తర్వాత ఆయన తల్లిదండ్రులను ఒప్పించే బాధ్యతను ఆంగ్‌ లీ తీసుకున్నాడు. మీ పిల్లాడు ఈ చిత్రంలో నటించడం అంటే చదువుతో సమానమేనని, దీని ద్వారా చిన్న వయస్సులోనే ఎంతో జీవితానుభవాన్ని గడిస్తాడని వారికి భరోసా ఇచ్చాడు లీ. ఆ సినిమా పూర్తి కావడానికి మూడేళ్లు పట్టింది.

  ఇప్పుడు 19 సంవత్సరాల సూరజ్‌ నగరంలోని సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజ్‌లో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మొదట తాను వాణిజ్య శాస్త్రాన్ని (కామర్స్‌) చదువుదామని అనుకున్నప్పటికీ 'లైఫ్‌ ఆఫ్‌ ఫై'లో నటించిన తర్వాత తాను ప్రపంచాన్ని చూసే దృక్కోణంలో ఎంతో మార్పు వచ్చిందని, అందుకే తాను తత్వ శాస్త్రాన్ని అభ్యసిస్తున్నాని అన్నాడు. ఈ నెలలో విడుదల కానున్న 'లైఫ్‌ ఆఫ్‌ పై' చిత్రంలో నటించే ముందు కౌమార దశలో ఉన్న అందరి అబ్బాయిల్లాగే తానూ తనదైన చిన్న ప్రపంచంలో జీవించేవాడినని, ఈ చిత్రం పూర్తి అయ్యేటప్పటికే తనలో వచ్చిన మార్పును, పరివర్తనను తన తల్లిదండ్రులు కూడా గుర్తించారని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. పాఠశాలలో చదువుతున్న సమయంలో తను ఎప్పుడూ 50-60 శాతం మార్కులతోనే సరిపెట్టుకునేవాడినని,తర్వాత తాను 12వ తరగతిలో 94 శాతం మార్కులను సాధించానని గర్వంగా చెబుతున్నాడీ ఢిల్లీ కుర్రాడు.

  'లైఫ్‌ ఆఫ్‌ పై' సినిమా చాలా భాగం సముద్రంపైనే చిత్రీకరించారు. పిసైన్‌ మెలిటర్‌ పటేల్‌ ఉరఫ్‌ పై అనే యువకుడు పసిఫిక్‌ మహా సముద్రంపై ఒక ఓడలో ప్రయాణం చేస్తున్న సమయంలో అది తుపానులో చిక్కుకుంటుంది. మొదట ఒక లైఫ్‌ బోటు తర్వాత చిన్న తెప్ప సాయంతో అతడు ఒక్కడే 227 రోజులు ప్రయాణం చేస్తాడు. మరో విశేషం ఏమిటంటే అతడితో పాటు ఒక పులి కూడా ఉంటుంది ఆ చిన్న పడవలో. అతడి సాహస యాత్రను, ఆ సముద్రంపై అతడు ఎదుర్కొన్న అనూహ్య పరిస్థితులను ఈ చిత్రంలో చూపించారు లీ.

  ఈ చిత్రం ఒక రూపాన్ని సంతరించుకోవడానికి ముందే కఠోర పరిశ్రమ చేయాల్సి వచ్చింది సూరజ్‌కు. చిత్రీకరణ నీటిపైనే కాబట్టి గంటల తరబడి సముద్రంలో ఈదడం, ఆ చిత్రంలోని పాత్రపై దృష్టిని పెట్టడం కోసం యోగా చేయడం దగ్గిర నుంచి ఒంటిపై ఎలుకలను పాకించుకోవడం కూడా ఈ చిత్ర సన్నాహాల్లో ఒక భాగమే. తనకు ప్రస్తుతం మరే చిత్రాల్లో నటించే ఉద్ధేశం లేదని, తన దృష్టి మొత్తం ప్రస్తుతం చదువు మీదే ఉందని, భవిష్యత్తులో మాత్రం న్యూయార్క్‌లోని 'టిస్సా స్కూల్‌ ఆఫ్‌ ది ఆర్ట్స్‌'లో కళలకు సంబంధించిన విద్యను అభ్యసించాలన్నది తన ఆశయమంటున్నాడు ఈ యువ కిశోరం.

  ప్రముఖ బాలీవుడ్‌ నటి టబు, ఇర్ఫాన్‌ఖాన్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను భారతీయ సంస్కృతికి దగ్గరగా ఉండేలా కేరళ, పాండిచ్చేరి లాంటి ప్రాంతాల్లో చిత్రీకరించారు. 'ఆంగ్లే' దర్శకత్వంలో రూపొందిన 'లైఫ్‌ ఆఫ్‌ పై' కథా గమనాన్ని పరిశీలిస్తే... ఒక సర్కస్‌ కుటుంబం సముద్ర మార్గంలో మరో ప్రాంతానికి వెళుతుండగా పెను తుఫాన్‌లో చిక్కుకుని జంతువులతో పాటు అంతా చెల్లాచెదురవుతారు. అయితే ఒక నౌక మాత్రం సముద్రపు నడి ఒడ్డున ఆగిపోగా అందులో ఒక పులి, 'పై' అనే యువకుడు మాత్రం మిగులుతారు. ఆకలిగొన్న ఆ పులి నుంచి తప్పించుకోవడానికి ఆ కుర్రాడు ఏం చేశాడో తెలుసుకోవాలంటే థియేటర్‌కు వెళ్ళాల్సిందే.

  English summary
  Suraj Sharma went from being a regular teenager growing up in New Delhi to starring in Ang Lee's big-screen adaptation of the bestselling novel "Life of Pi".
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more