»   » డేటింగ్ చేయవద్దంటూ కూతుర్లపై... స్టార్ హీరో ఆంక్షలు

డేటింగ్ చేయవద్దంటూ కూతుర్లపై... స్టార్ హీరో ఆంక్షలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: 'రాకీ, ర్యాంబో' సినిమా సిరిస్‌ల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హాలీవుడ్ రాక్ స్టార్ సిల్వెస్టర్ స్టాలన్ తన కుటుంబానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఆయనకు సోఫియా(18), సిస్టీన్ (16), స్కార్లెట్ (13) అనే ముగ్గురు కూతుర్లు ఉన్నారు.

ఏ అబ్బాయిని డేటింగ్ కు అనుమతించబోవద్దని తన కూతుళ్లకు ఇప్పటికే చెప్పానని ప్రముఖ సిల్వెస్టర్ స్టాలోన్ అన్నారు. 40 సంవత్సరాలు వచ్చేవరకు అలాంటి పనులకు అంగీకరించవద్దని తాను సలహా ఇచ్చానని అయితే, ఈ విషయంపై అంతా తనపై గొడవపడి తన మాట వినలేదని అన్నారు.

Sylvester Stallone bans daughters from dating?

సోఫియాకు పద్నాలుగేళ్ల వయసున్నప్పుడు ఓ అబ్బాయి డేటింగ్ కోసం అడిగాడు. ఒక తండ్రి స్థానంలో ఉండి నేను అనుమతించలేకపోయాను. కానీ, నా కూతురు నా మాట వినలేదు. చివరికి ఆమె బాయ్ ఫ్రెండ్ కు నేను షేక్ హ్యాండ్ ఇవ్వాల్సి వచ్చింది. అయితే జాగ్రత్తలు కూడా చెప్పాను' అని ఆయన వివరించారు.

సిల్వెస్టర్ స్టాలెన్ సినిమా గురించి చెప్పుకుంటే...2010లో హాలీవుడ్‌లో విడుదలై బాక్సాఫీసు రికార్డుల్ని సృష్టించిన హాలీవుడ్ చిత్రం 'ఎక్స్‌పెండబుల్స్'. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన 'ది ఎక్స్‌పెండబుల్స్‌ 2' , 'ది ఎక్స్‌పెండబుల్స్‌ 3' సినిమా అటు సిల్వస్టర్‌ స్టాలోన్‌ అభిమానుల, ఇటు ఆర్నాల్డ్‌ స్వార్జ్‌నెగ్గర్‌ అభిమానుల ఆకట్టుకుని భారీ విజయం సాధించింది.

English summary
Sylvester Stallone bans daughters from dating?
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu