»   » స్టార్‌ని కాకపోతే 'టీచర్'ని అయ్యేదాన్ని: పాప్ స్టార్

స్టార్‌ని కాకపోతే 'టీచర్'ని అయ్యేదాన్ని: పాప్ స్టార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సాధారణంగా స్టార్ సెలబ్రిటీలు అందరూ హీరోనో, హీరోయిన్‌నో కాకపోయి ఉంటే డాక్టర్‌నో, యాక్టర్‌నో అయి ఉండే వాడినని చెబుతుంటారు. ఇందుకు నిదర్శనం టాలీవుడ్ యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య తను గనుక తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం కాకపోయి ఉంటే ఆటో మొబైల్స్ ఫీల్డ్‌లో సెటిల్ అయ్యే వాడినని అన్న సందర్బాలు అనేకం. అందాల తార అనుష్క కూడా తాను సినిమా పరిశ్రమకు హీరోయిన్‌గా పరిచయం కాకుండా యోగ టీచర్‌ని అయి ఉండేదానిని అన్న విషయం కూడా మనకు తెలిసిందే.

ఇది ఇలా ఉండే హాలీవుడ్ పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ కూడా తాను పాప్ స్టార్‌ని కాక పోయి ఉంటే టీచర్ వృత్తిని చేపట్టేదానిని పాప్ జస్టిక్‌కి ఇచ్చిన ఇంటర్యూలో తెలిపింది. ఈసందర్బంలో బ్రిట్నీ స్పియర్స్ మాట్లాడుతూ నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. సాధారణంగా నేను ఎప్పుడైనా షోలకు వెల్లినప్పుడు కూడా ముందు చిన్నారి అభిమానులను కలవడానికి ముందుగా ఆసక్తి చూపుతానని అన్నారు. వారు చూడడానికి చాలా అందంగా ఉండడమే కాకుండా ముద్దు కూడా వస్తారని అన్నారు.

వీటితోపాటు తను చరిత్రను తెలుసుకోవడానికి చాలా ఆసక్తి చూపుతానని అన్నారు. 1920లో జరిగిన సంఘటనలు, అద్బుతాలు అన్నింటిని తెలుసుకోవడానికి ప్రస్తుతం చరిత్రను చదువుతున్నానని అన్నారు. ప్రస్తుతం బ్రిట్నీ స్పియర్స్ కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్‌తో ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. కానీ తన పిల్లలు సీన్ ప్రీస్టెన్, జేడెన్ లను మాత్రం ఆత్మ విశ్వాసంతో పెంచుతానని ఇంటర్వూలో తెలిపారు.

English summary
Britney Spears says if she weren’t a pop star, she would rather have been a teacher.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu