»   »  ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ ‘టెర్మినేటర్ జెనిసీస్’ టాక్ ఎలా ఉంది?

ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ ‘టెర్మినేటర్ జెనిసీస్’ టాక్ ఎలా ఉంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హాలీవుడ్ యాక్షన్ చిత్రాలకు, సైన్స్ ఫిక్షన్ చిత్రాలకు ఇండియాలోనూ మంచి పేరుంది. ఇటీవల విడుదలైన ‘జూరాసిక్ వరల్డ్' మూవీ ఇండియన్ భాక్సాఫీసు వద్ద 100 కోట్లుపైగా వసూలు చేసింది. తాజాగా ఆర్నల్డ్ ష్వార్జ్ నెగ్గెర్ నటించిన ‘టెర్మినేటర్ జెనిసీస్' చిత్రం నేడు ఇండియా వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది.

తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీష్ 3డి, 2డి వెర్షన్లలో ఈచిత్రాన్ని రిలీజ్ చేసారు. 67 ఏల్ల ఆర్నాల్డ్ నటిస్తున్న ఈ చిత్రం టెర్మినేటర్ సిరీస్‌లో 5వ చిత్రం. గతంలో ఈ సిరీస్ లో వచ్చిన 4 చిత్రాలు మంచి విజయం సాధించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

terminator genisys

నేడు విడుదలవ్వడానికే ముందే.... గురువారం పలు ప్రాంతాల్లో ప్రత్యేకంగా ప్రీమియర్ షోలు వేసారు. సినిమా చూసిన వారు, క్రిటిక్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం.... గత చిత్రాలతో లిస్తే ‘టెర్మినేటర్ జెనిసీస్' యావరేజ్ గా ఉందని అంటున్నారు. ఈ చిత్రానికి సినీ విమర్శకులు యావరేజ్ గా 2.5/5 రేటింగ్ ఇచ్చారు.

ఇందులో ఆయన టెర్మినేటర్ ఒరిజినల్ టి-800 మోడల్ కనిపించారు. లీ బైంగ్ విలన్ పాత్రలో టి-1000 మెడల్ గా కనిపించారు. అయితే ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గెర్ అభిమానులకు మాత్రం ఈ చిత్రం నచ్చుతుందని అంటున్నారు. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, సాంకేతిక విలువలు అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు.

English summary
Emilia Clarke and Arnold Schwarzenegger return in Terminator Genisys, an Alan Taylor sequel that aims to reboot the franchise.
Please Wait while comments are loading...