»   »  ‘టెర్మినేటర్ జెనిసీస్’ ఇండియా రిలీజ్ డేట్ ఖరారైంది

‘టెర్మినేటర్ జెనిసీస్’ ఇండియా రిలీజ్ డేట్ ఖరారైంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గెర్ హీరోగా వచ్చే హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సిరస్ ‘టర్మినేటర్' సిరీస్ చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో కొత్తగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఈ సీరీస్ లో వచ్చిన టర్మినేటర్-2, టర్మినేటర్-3 చిత్రాలు భారీ విజయం సాధించాయి. త్వరలో గత సినిమాలకు కొనసాగింపుగా ‘టెర్రినేటర్ జెనిసిస్' పేరుతో మరో సినిమా రాబోతోంది.

జులై 1న సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇండియాలో ఈ చిత్రం జులై 3న విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ చిత్రంలోనూ 67 ఏళ్ల ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ హీరోగాగా నటిస్తున్నారు. ఇందులో ఆయన టెర్మినేటర్ ఒరిజినల్ టి-800 మోడల్ కనిపించబోతున్నారు. లీ బైంగ్ విలన్ పాత్రలో టి-1000 మెడల్ గా కనిపించబోతున్నారు. అలాన్ టేలర్ దర్శకత్వం వహిస్తున్నారు.

 Terminator Genisys to release in India on July 3

‘టెర్రినేటర్ జీనిసిస్' సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు ట్రైలర్లు విడుదల చేసారు. మొదటి ట్రలైర్ తో పాటు తాజాగా విడుదలైన సెకండ్ ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మరోసారి ఈ టెర్మినేటర్ ప్రపంచ సినీ అభిమానులను మెప్పించబోతున్నాడని స్పష్టమవుతోంది. 170 మిలియన్ డాలర్ల ఖర్చుతో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రంలో ఇంకా ఎమిలి క్లార్క్, జాసన్ క్లార్క్, జాయ్ కోర్ట్నెనీ, మాట్ స్మిత్, లీ బైంగ్, డాయో ఒకెనియి, కోర్ట్నెనీ బి.వాన్స్, సాన్‌డ్రైన్ హోల్ట్, జెకె.సిమన్స్, డగ్లస్ స్మిత తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి డేవిడ్ ఎలిసన్, డనా గోల్డ్ బెర్గ్ నిర్మాతలు. పారామౌంట్ పిక్చర్స్ వారు ఈచిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

English summary
Hollywood star Arnold Schwarzenegger will be back with more action, thrill and adrenaline- pumping stunts with “Terminator Genisys”. His latest science-fiction action film of the popular franchise will hit the screens in India on July 3.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu