»   » తెలుగులో వస్తున్న ‘టెర్మినేటర్’(మరో సృష్టి)

తెలుగులో వస్తున్న ‘టెర్మినేటర్’(మరో సృష్టి)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ముప్పై ఏళ్ళగా వస్తున్న ‘టెర్మినేటర్‌' సీరిస్‌ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. నేటికీ ఆ సినిమాలకు ఏ మాత్రం క్రేజ్‌ తగ్గలేదు. అందుకు కథాబలం ఒక కారణమైతే, అప్పటి నుంచి ఇప్పటి వరకు టెర్మినేటర్‌ సీరిస్‌ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఆర్నాల్డ్‌ స్వాజ్‌నెగ్గర్‌ మరో ముఖ్యమైన కారణం.

మెషీన్‌మెన్‌ అనే పదానికి ఆయనొక పర్యాయపదం. తాజాగా 'టెర్మినేటర్‌ జెనిసిస్‌'తో ప్రేక్షకుల ముందుకిరానున్నారు. అలెన్‌ టేలర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌ సంస్థ ‘టెర్మినేటర్‌' (మరో సృష్టి) టైటిల్‌తో జూలై 3న తెలుగు ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తుంది.

Terminator Genisys in Telugu, release on 3 July

వయాకామ్‌ 18 ప్రతినిధులు మాట్లాడుతూ ‘‘ఒక హీరో 30 ఏళ్లుగా ఒకే సినిమా ప్రాంచైజ్‌గా చేస్తూ నటించడం గొప్ప విషయం. హాలీవుడ్‌లో ఆర్నాల్డ్‌తో పని చేసిన ఏ టెక్నిషియన్‌ని ఆడిగినా ‘ఆర్నాల్డ్‌ అమేజింగ్‌' అంటూ ఎంతో గొప్పగా చెబుతున్నారు. ఈ సినిమా కోసం ఆయన్ని కలవడం వల్ల ఆయన వ్యక్తిత్వం, వృత్తికి ఆయనిచ్చే విలువ, సెన్స్‌ ఆఫ్‌ హ్యుమర్‌ అన్ని తెలిశాయి. కేవలం సినిమా గురించే కాదు పాలిటిక్స్‌, కార్స్‌, ఫ్యాషన్‌, ఎన్విరాన్‌మెంట్‌ ఇలా ఏ అంశం మీదైనా ఆయన మాట్లాడగలరు. ఆయన నటించిన ‘టెర్మినేటర్‌ జెనిసిస్‌'ను టెర్మినేటర్‌(మరోసృష్టి) టైటిల్‌తో వయాకామ్‌ ద్వారా తెలుగులో విడుదల చెయ్యడం ఆనందంగా ఉంది. ఆర్నాల్డ్‌ చేసిన యాక్షన్‌ సీక్వెన్స్‌ ప్రేక్షకుల్ని ముగ్దుల్ని చేస్తుంది. ఐమాక్స్‌ త్రీడీ, డిజిటల్‌ త్రీడీ, 2డి థియేటర్స్‌లో జూలై 3న తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీష్‌ భాషల్లో విడుదలచేస్తున్నాం అని తెలిపారు.

English summary
It is not very often that an actor is associated with a franchise for over a period of time like this Austrian actor, who is all set to come back with high octane action packed ‘Terminator Genisys’ releasing on 3rd July. Distributed by Viacom18 Motion Pictures in India, Terminator Genisys is a complete re-imagination of James Cameron’s Terminator universe.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu