ఈ రెండో ట్రైలర్ కూడా ఓ రేంజిలో ఉంది (వీడియో)
లాస్ ఏంజిల్స్: చిలీలోని ఓ గనిలో చిక్కుకున్న 33 మందిని బయటికి తీసే క్రమంలో ఎదుర్కొన్న సవాళ్ల ఆధారంగా రూపొందిన చిత్రం 'ది33'. ఈ సినిమా ట్రైలర్-2ని చిత్ర బృందం విడుదల చేసింది. 2010లో జరిగిన ఈ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ రేపింది.
ఈ ఘటన నుంచి బయట పడిన వారి స్వీయ అనుభవాలతో దర్శకురాలు పార్టీకా దీనిని రూపొందించారు. భూమి లోపల గనిలో 200 అంతస్తుల కింద దాదాపు 69 రోజుల పాటు గడిపిన వారి అనుభవాలను ఎంతో ఆసక్తికరంగా చిత్రీకరించారు. ఈ సినిమా నవంబర్ 13 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ఆ గనిలో చిక్కుకున్న 33 మంది ఏమయ్యారు..వాళ్లు బయిటకు తిరిగి వచ్చారా లేదా అనే కధాంశంతో తెరకెక్కింది. ఈ మూవి మొదటి ట్రైలర్ ఇప్పటికే విడుదలై విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.



Click it and Unblock the Notifications











