'అమేజింగ్‌ స్పైడర్‌ మ్యాన్‌-2' విడుదల తేదీ

By Srikanya

హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా ఎంతగానో ప్రేక్షకాదరణ పొందిన స్పైడర్‌మేన్‌ సిరిస్‌లో భాగంగా రెడీ అయిన 'అమేజింగ్‌ స్పైడర్‌ మ్యాన్‌-2' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సూపర్‌ హీరో చిత్రం 2014 వేసవిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్‌ ఇటీవలే విడుదలైంది. సోని సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది. మార్క్‌ వెబ్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ఆండ్రూ గ్యారీఫీల్డ్‌ హీరోగా నటించారు. ఈ చిత్రం విడుదల కోసం ట్రేడ్ వర్గాలు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. తమ అంతకుముందు చిత్రాన్ని మించి ఘన విజయం సాధిస్తుందని సోనీ సంస్ధ వర్గాలు చెప్తున్నాయి. మే 2,2014 న విడుదల తేదీగా ప్రకటించారు.

ప్రపంచ వ్యాప్తంగా స్పైడర్ మ్యాన్ సిరిస్ చిత్రాలకు గల క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. చిన్న పిల్లలతో పాటు పెద్దల్ని కూడా పెద్ద ఎత్తున ఆకట్టుకునే చిత్రం సరిక్రొత్త సాంకేతిక మాయాజాలంతో ప్రేక్షకుల్ని ఆద్యంతం మంత్ర ముగ్దుల్ని చేసేందుకు సర్వాంగ సుందరంగా ముస్తాబై 'ది ఎమేజింగ్ స్పైడర్ మ్యాన్-2' అనే పేరుతో విడదలవుతొంది. అత్యంత భారీ బడ్జెట్‌తో మార్క్ వెబ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సోని పిక్చర్స్ ద్వారా తెలుగు, ఇంగ్లీషు మరియు హిందీ భాషలలో ప్రపంచం అంతటా 2డి మరియు 3డి వెర్షన్లలో భారీ ఎత్తున ధియేటర్లలో విడుదవుతొంది.

The Amazing Spider-Man 2 release date

ప్రపంచ వ్యాప్తంగా ఈ స్పైడర్ మ్యాన్ చిత్రాలకు గల క్రేజ్‌ను, అంచనాలను దృష్టిలో పెట్టుకోని ఇప్పటివరకు వచ్చిన స్పైడర్ మ్యాన్ చిత్రాలను మరిపించేలా 'ది ఎమేజింగ్ స్పైడర్ మ్యాన్ -2 'ని రూపొందించాం అని అన్నాడు. సోని పిక్చర్స్ ప్రతినిధి ఈ చిత్రం విడుదల గురించి మాట్లాడుతూ స్పైడర్ మ్యాన్ చిత్రాలకు ప్రేక్షకుల్లో గల విశేష్ ఆదరణను దృష్టిలో పెట్టుకోని 'ది ఎమేజింగ్ స్పైడర్ మ్యాన్' సినిమాని తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నాం అని అన్నారు. సరిక్రొత్త సాహాస కృత్యాలతో రూపొందించిన ఈ సినిమా అభిమానులకు ఓ అనుభూతిని మిగుల్చుతుంది. టైటిల్‌లో ఉన్న అమేజింగ్ అనే పేరుకు తగ్గట్లే ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తుంది. ఇప్పటికే మార్కెట్లోకి విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది.

ది ఎమేజింగ్ స్పైడర్ మ్యాన్ నటీ నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు:
ప్రొడక్షన్ కంపెనీ: కొలంబియా పిక్టర్స్
దర్శకుడు: మార్క్ వెబ్
రచయితలు: అలెక్స్ (స్క్రీన్ ప్లే), రామర్ట్ ఓర్సీ (స్క్రీన్ ప్లే)
స్టార్స్: ఆండ్రూ గార్ఫీల్డ్, ఎమ్మా స్టోన్ మరియు జిమ్మీ ఫాక్స్ తదితరులు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X