»   » ‘ది సర్కిల్’... సిలికాన్‌వ్యాలీ చీకటి కోణాలపై హాలీవుడ్ మూవీ (ట్రైలర్)

‘ది సర్కిల్’... సిలికాన్‌వ్యాలీ చీకటి కోణాలపై హాలీవుడ్ మూవీ (ట్రైలర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: హాలీవుడ్లో తెరకెక్కుతున్న 'ది సర్కిల్' అనే సినిమా ట్రైలర్ ఈ రోజు విడుదలైంది. డేవ్ ఎగ్గర్స్ రాసిన నవల ఆధారంగా అదే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రపంచ సాఫ్ట్‌వేర్ రంగానికి కేంద్రమైన సిలికాన్ వ్యాలీలోని చీకటి కోణాలను ఆవిష్కరిస్తూ తెరకెక్కించారు.

'The Circle' movie Official Trailer

హాలీవుడ్ స్టార్ ఎమ్మా వాట్సన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జేమ్స్ పాన్‌సోల్డ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఎమ్మా వాట్సన్ తో పాటు టామ్ హాంక్స్, జాన్ బోయెగా, కారెన్ గిలన్, పాటన్ ఓస్వాల్ట్, బిల్ పాక్స్ టన్ నటిస్తున్నారు.

ఫేస్ బుక్, గూగుల్ లాంటి సంస్థను పోలిన..... 'ది సర్కిల్' అనే కంపెనీలో ఎమ్మా వాట్సన్ ఉద్యోగం సంపాదిస్తున్నారు. అందులో జాయిన్ అయిన తర్వాత ఆమె ఎలాంటి పరిణామాలు ఎదుర్కొందనే విషయాలను ఫోకస్ చేస్తూ ఈ సినిమా సాగుతుంది. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ప్రపంచంలోని పరిస్థితులపై ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఏప్రిల్ 28న ఈ సినిమా విడుదలవుతోంది.

English summary
There's a new trailer out for the upcoming film "The Circle," an adaptation of the Dave Eggers novel that explores the dark side of Silicon Valley and the tech behemoths that dominate it. Here's the trailer for the film, which will come out April 28.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu