»   » వాడు చనిపోయిన రోజు నాజీవతంలో చాలా వరస్ట్ డే..

వాడు చనిపోయిన రోజు నాజీవతంలో చాలా వరస్ట్ డే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

మైఖెల్ జాక్సన్ తల్లి కతిరినీ తన కోడుకు మైఖెల్ జాక్సన్ చనిపోయిన రోజు తన జీవితంలో చాలా వరస్ట్ డే గా అభివర్ణించారు. ఇటీవల ఈవిషయంపై ఆమె స్పందిస్తూ తన భాదను మైఖెల్ జాక్సన్ పర్సనల్ డాక్టర్ ముర్రేపై తన కోపాన్ని వెళ్శగక్కారు. ఎప్పుడైతే డాక్టర్ ముర్రే ఫోన్ చేసి మైఖెల్ చనిపోయాడు అని చెప్పినప్పుడు తన గుండె ఒక్క నిముషం అలా ఆగిపోయిందని అన్నారు. మైఖెల్ చనిపోయిన చాలా సేపటివరకు కూడా డాక్టర్ ముర్రే మాకు ఆవిషయాన్ని చెప్పకుండా దాచిపెట్టాడని అన్నారు.

చివరకు ఆవిషయాన్ని మాతో ప్రస్తావించగా అసలు ఏమి జరిగిందని అన్నానని అన్నారు. దానితో డాక్టర్ ముర్రే అతను చని పోయి చాలా సేపు అయింది కాబట్టి బాడీని తీసుకెళ్శవసిందిగా కోరాడు. దానితో నాకు ఒక్కసారి కోపం వచ్చి నువ్వేకావాలని చేశావా అని అడిగాను అని అడుగుతుండగా నాకు కళ్శు తిరిగి పడిపోయాను అక్కడివరకే నాకు గుర్తుఉందని తన మనసులోని మాటలను వివరించారు.

అంతేకాకుండా నేను చాలా సార్లు డాక్టర్ ముర్రే తో దేవుడు ఎందుకని నాబిడ్డ విషయంలో చాలా తోందరపడ్డాడని, అసలు నాబిడ్డ గురించి ఎందుకు కేర్ తీసుకోలేదని అన్నాను. అసలు వాడిని నువ్వు ఎందుకు బ్రతికించలేక పోయావని ఏడ్చానని అన్నారు. దీనిపై నేను ముర్రేని నిందించడం లేదు. మనకు ఎవరికి తెలియదు ముర్రే కావాలని చేశాడా లేక పోరపాటున చేశాడా అనే విషయం. నా బిడ్డే పోయిన తర్వాత ఇంక వాటి గురించి ఏమి లాభం అని అన్నారు.

చివరగా మాట్లాడుతూ నన్ను కూడా త్వరలో ఆదేవుడు మైఖెల్ దగ్గరకి తీసుకోని వెళ్శాలని కోరుకుంటున్నానని అన్నారు. మైఖెల్ నాకు ఎప్పుడు గుర్తుకు వచ్చిన నా కళ్శ వెంట నీళ్శు బుడా బుడా కారుతాయన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu