twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఎక్స్‌పెండబుల్స్-2' మొదటి మూడు రోజుల కలెక్షన్లు అదుర్స్

    By Nageswara Rao
    |

    న్యూఢిల్లీ: 2010లో హాలీవుడ్‌లో విడుదలై బాక్సాఫీసు రికార్డుల్ని సృష్టించిన హాలీవుడ్ చిత్రం 'ఎక్స్‌పెండబుల్స్' కు సీక్వెల్‌గా వచ్చిన 'ది ఎక్స్‌పెండబుల్స్‌ 2' సినిమా అటు సిల్వస్టర్‌ స్టాలోన్‌ అభిమానుల, ఇటు ఆర్నాల్డ్‌ స్వార్జ్‌నెగ్గర్‌ అభిమానుల అంచనాలను అందుకున్నట్లుంది. ఆగస్టు 24వ తారీఘున దేశ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మొదటి మూడు రోజులకు గాను సుమారు రూ. 10.94 కోట్లను వసూలు చేసి ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డుగా నిలిచింది.

    'ఎక్స్‌పెండబుల్స్-2' సినిమాని ఇండియాలో మల్టీవిజన్ మల్టీమీడియా ప్రై. లి కంపెనీ డిస్ట్రిబ్యూట్ చేసింది. దేశ వ్యాప్తంగా ఈ సినిమాని 800 స్క్రీన్స్ మీద విడుదల చేసింది. సినిమా విడుదల చేసిన మొదటి రోజు (ఆగస్టు 24)న రూ. 2.95 కోట్ల రూపాయలను వసూలు చేయగా... ఆ తర్వాత శని, ఆది వారాల్లో బాక్సాఫీసు వసూళ్లను వసూలు చేసింది. శనివారం ఒక్కసారిగా సినిమా వసూళ్లు ఊపందుకోని రూ. 3.73 కోట్లు, ఆదివారం రూ. 4.26 కోట్ల వసూళ్లు వచ్చాయి.

    ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన మల్టీవిజన్ మల్టీమీడియా ప్రై. లి కంపెనీ డైరెక్టర్ అమిత్ జైతాని మాట్లాడుతూ ఒక హాలీవుడ్ సినిమా మూడు పదిరోజుల్లో వసూలు చేసిన వసూళ్లను చూసి సినీ జనాలు ఆశ్యర్యానికి గురైనట్లు తెలిపాడు. మేము ఊహించిన దానికంటే బాక్సాఫీసు వసూళ్లు రావడంతో ఉబ్బితబ్బిబవుతున్నట్లు చెప్పాడు. మంచి రివ్యూలు, ప్రజల స్పందన ఇదే విధంగా ఉంటే వచ్చే వారంలో కూడా మంచి వసూళ్లను సాధిస్తామని తెలిపాడు. ఇండియాలో ఇంగ్లీషు, తెలుగు, తమిళం, హిందీ బాషలలో ఈ సనిమాను విడుదల చేశారు.

    కథ విషయానికి వస్తే ఓ సకార్యాన్ని నెరవేర్చాలనుకున్న ఎక్స్‌పెండబుల్‌ టీమ్‌ అనుకోని అవాంతరాలను ఎదుర్కొంటుంది. శత్రువు దాడివల్ల ముఖ్య సభ్యుడ్ని కోల్పోతుంది. దాంతో టీమ్‌లో మరో ఇద్దరిని చేర్చుకుని చంపిన వాడిపై పగతీర్చుకుంటుంది. శత్రువుని చంపే క్రమంలో వివిధ ట్విస్టులతో పాటు ఈ చిత్రంలో గ్రాఫిక్స్ చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకూ అందరిని ఆకట్టుకుంటాయని అన్నాడు.

    హాలీవుడ్‌లో 100 కోట్ల మిలియన్ డాలర్ల వ్యయంతో 11 మంది అగ్ర హీరోలతో భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌లో రూపొందించిన ఈ చిత్రాన్ని చూస్తుంటే చాలా థ్రిల్‌గా ఉందని అజయ్ దేవ్ గన్ అన్నారు. ఇంత మంది స్టార్ హీరోలతో సినిమా అంటే అది కేవలం హాలీవుడ్ లోనే సాధ్యం. ప్రపంచ సినీ చరిత్రలో ఇదొక వండర్‌గా నిలుస్తుందన్నారు.

    అభిమానులకంటే కూడా ఇండియా సినిమా ఆర్టిస్టులు సైతం చూడడానికి ఎంతో కూతూహలాన్ని ప్రదర్శిస్తారు. అభిమానుల ఎక్స్ పెక్టేషన్స్ తగ్గట్టుగా ఈ సినిమా భారీ యాక్షన్ సన్నివేశాలతో రూపొందిచారని అన్నాడు.

    మాటలు: మైథిలి కిరణ్
    నిర్మాతలు: డి.సుబ్రహ్మణ్యం, ఎస్.సురేష్
    స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సైమన్ వెస్ట్

    తెలుగు వన్ఇండియా

    English summary
    “The Expendables 2″ served as a feast for Sylvester Stallone and Arnold Schwarzenegger fans in India, and received a favorable response for its distributor by earning approximately Rs.10.94 crore within the first three days of its release in the country.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X