»   » ధనుష్ నటించిన తొలి హాలీవుడ్ మూవీ... ట్రైలర్ సూపర్!

ధనుష్ నటించిన తొలి హాలీవుడ్ మూవీ... ట్రైలర్ సూపర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరో ధనుష్ 'ది ఎక్స్ ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ఫకిర్' అనే సినిమా ద్వారా హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. తనదైన పెర్ఫార్మెన్స్‌తో ధనుష్ అదరగొట్టాడు. ఈ చిత్రానికి కెన్ స్కాట్ దర్శకత్వం వహస్తున్నారు.

'ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకిర్ హూ గాట్ ట్రాప్డ్ ఇన్ ఐకియా వాడ్రోబ్' అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ పుస్తకాన్ని మైన్ పురెటోలాస్ రాశారు. ఇందులో ధనుష్ స్ట్రీట్ మెజీషియన్ పాత్రలో నటించాడు. తల్లి అకాల మరణంతో తండ్రిని వెతుక్కుంటూ పారిస్ బయల్దేరుతాడు. అక్కడ హీరో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనేది మిగతా స్టోరీ.

ఇందులో ధనుష్ పాత్ర పేరు అజాతశత్రు లావష్ పటేల్. తనదైన నటనతో ధనుష్ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేయబోతున్నాడని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. మే 30వ తేదీన ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇండియాలో ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఫ్రెంచి, ఇంగ్లిష్ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. మరి సౌత్‌లో ధనుష్‌‌కు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో తమిళం, తెలుగులో ఈ చిత్రాన్ని అనువదించి విడుదల చేసే అవకాశం కూడా ఉంది.

English summary
The Extraordinary Journey Of The Fakir Official Trailer released. Actor Dhanush, who has shared a poster and teaser of his Hollywood debut "The Extraordinary Journey of the Fakir", says it has indeed been a journey extraordinaire.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X