»   » ఆ నెక్లస్ లో కామెడీ తో పాటు ట్రాజెడీ కూడా ఉంది..!

ఆ నెక్లస్ లో కామెడీ తో పాటు ట్రాజెడీ కూడా ఉంది..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాకు ఒక రకమైన దుస్తులు మాత్రమే నప్పుతాయి అని అంటోంది హాలీవుడ్ హాట్ తారగా పేరొందిన కేట్ హుడ్సన్. నాకున్న స్టైల్ ఎప్పటికీ మారదు. నేను ఎప్పుడూ కంపర్టబుల్ మరియు అనుకూలంగా ఉండే దుస్తులను మాత్రమే వేసుకుంటానంటోంది. అంతేకాకుండా తన భర్త రాబిన్ సన్ తనని అనుమానిస్తున్నాడంటూ, ఇక తనతో కలసి ఉండటం సాధ్యం కాదని అక్టోబర్ 22, 2007 విడాకులు తీసుకోవడం జరిగినది. వీళ్శిద్దరూ కలసి ఉన్నప్పుడు వీరికి ఒక రైడర్ అనే అబ్బాయి పుట్టాడు. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మాధ్యూ బెల్లమితో కలసి ఉంటుంది. దానితో పాటు తన ప్రియుడు మాధ్యూ బెల్లమి మరియు కోడుకు రైడర్ తో కలసి ఒక మ్యాగజైన్ కు ఫోజు ఇవ్వడం జరిగినది.

పెద్దగా ఉండే దుస్తులను అంటే తనకి ఇష్టం లేదని, అలాంటివి తాను ఎప్పుడూ ఎప్పుడూ వేసుకోలేదని అన్నారు. దుస్తులతో పాటు వాటికి సరిపడే వస్తువులను మాత్రమే ధరిస్తాను. అంతేకాకుండా మా అమ్మ గిఫ్ట్ గా ఇచ్చినటువంటి జ్యూయలరీ అంటే తనకి ప్రాణం అని అంటోంది. అంతేకాకుండా ఈ సంవత్సరం పుట్టినరోజుకి వాళ్శ అమ్మ ఒక గోల్ద్ నెక్లస్ ఇచ్చారని, ఆ నెక్లస్ లో కామెడీ మరియు ట్రాజెడీ ఉన్న మాస్క్ తోపాటు, చిన్న డైమండ్ కలిగి ఉందని ఆమె వివరించారు. దాని అర్దం ఏమిటంటే ఈ సంవత్సరంలో నేను కష్టాల్ని, సుఖాల్ని రెంటిని చూసానని మా అమ్మ తెలిపారన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu