»   » స్టార్ హీరోయిన్ మరణం..ఆస్ది కోసం దెబ్బలాటలు

స్టార్ హీరోయిన్ మరణం..ఆస్ది కోసం దెబ్బలాటలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్ క్లియోపాత్రా ఎలిజిబుత్ టేలర్ రీసెంట్ గా స్వర్గస్తురాలయిన సంగతి తెలిసిందే.అయితే ఆమె మరణం ఇప్పుడు ఆమె కుటుంబంలో కలతలు రేపింది.ఆమె ఆస్ధి..స్ధిర,చర కలిపి దాదాపు ఆరు వందల మిలియన్ల నుంచి ఒక బిలియన్ మధ్య ఉంటుది. దాంతో ఆ ఆస్ది కోసం ఆమె కుటుంబ సభ్యులు,బిజినెస్ మేనేజర్స్, ఛారటీ సంస్ధల మధ్య పోరాటం మొదలైంది. ఆమె నగలు ను వేలం వేసి వచ్చిన డబ్బుని ఎయిడ్స్ ఫౌండేషన్ కి పంచాలని ఆమె విల్లులో ఉంది.మిగతా ఆస్ది గురించి స్పష్టంగా ఎవరకి ఏమి చెందాలో రాసి లేదు.అంతేగాక ఆమె దగ్గర ఎంతో కాలంగా ఉంటున్న వైట్ డైమండ్స్ ని ఎవరికి చెందాలనేది పెద్ద సమస్యగా మారింది.మైకెల్ జాక్సన్ మరణం అనంతరం జరిగిన వివాదాలు లాంటివే ఇప్పుడూ జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు.ఇక ఎలిజిబుత్ టేలర్ కు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు, పదిమంది మనవలు, నలుగురు ముని మనవలు ఉన్నారు. దాదాపు యాభైకి పైగా సినిమాల్లో నటించిన ఎలిజబెత్ టేలర్, చివరిసారిగా 2006లో సీఎన్‌ఎన్ చానల్ నిర్వహించిన లారీ కింగ్ లైవ్ అనే్ టాక్ షోలో కనిపించారు.

English summary
Elizabeth Taylor has left behind a fortune that ranges somewhere between $600 million and $1 billion. Now the fight for that fortune is on between family, business managers and the countless charities that Elizabeth Taylor was so caring about.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu