»   » అద్బుతం కంటే ఎక్కువే: అవెంజర్స్- ఇన్ఫినిటీ వార్ ట్రైలర్ టాక్

అద్బుతం కంటే ఎక్కువే: అవెంజర్స్- ఇన్ఫినిటీ వార్ ట్రైలర్ టాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకప్పుడు మనకున్న సూపర్ హీరోస్ హనుమాన్, రామ్, భీమ్ ఇలాంటివే ఉండేవి లోకాన్ని కాపాడే వీరులూ అంటే మన పురాణ గాథల్లో ఉండే వీరులే.., అయితే రానూ రానూ అమన హీరోలు దేవుళ్లైపోతే పిల్లలకోసం ఫారిన్ హీరోలని దిగిమతి చేసుకున్నారు పిల్లలు ఇప్పటిపిల్లలకి సూపర్ హీరోస్ అంటే అవెంజర్సే....

 ఐరన్ మేన్ సిరీస్

ఐరన్ మేన్ సిరీస్

సూపర్ హీరోల సినిమాల ట్రెండ్ మార్చిన ఘనత అవెంజర్స్ కే దక్కుతుంది. అంతవరకు ఒక సినిమా మొత్తం ఒక సూపర్ హీరో చుట్టూనే తిరిగేది. స్పైడర్ మేన్ సిరీస్ లో నాలుగు.. ఐరన్ మేన్ సిరీస్ లో నాలుగు సినిమాలు వచ్చాయి. ఒక్క సినిమాలో ఐదారుగురు సూపర్ హీరోలు ఒకేసారి ఫైట్ చేస్తుంటే ఎంత రంజుగా ఉంటుందో అవెంజర్స్ సినిమా ప్రేక్షకులకు పరిచయం చేసింది.

అదిరిపోయే యాక్షన్

అదిరిపోయే యాక్షన్

అదిరిపోయే యాక్షన్ తో సాగే అవెంజర్స్ సిరీస్ లో ఇప్పటికి రెండు సినిమాలొచ్చాయి. తాజాగా మార్వెల్ స్టూడియో మూడో పార్ట్ ఇన్ఫినిటీ వార్ ట్రైలర్ రిలీజ్ చేసింది. ఈ పార్ట్ లో ప్రపంచాన్ని పాత సూపర్ హీరోలతో పాటు కొత్త హీరోలు బోలెడుమంది యాడయ్యారు. ముందు రెండు పార్టుల్లో ఆరుగురు హీరోలుంటే ఈసారి వాళ్ల సంఖ్య డజను దాటి ఇరవై వరకు చేరింది.

భారీ లుక్ వచ్చేసింది

భారీ లుక్ వచ్చేసింది

అందరూ కలిపి మూకుమ్మడిగా యుద్ధం చేస్తుంటే ప్రేక్షకుల కళ్లు చెదిరిపోతాయనే చెప్పొచ్చు. ట్రయిలర్ మొత్తం ఒక్కో క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చేస్తూ పోయేసరికే భారీ లుక్ వచ్చేసింది. కెప్టెన్ అమెరికా - థోర్ - హల్క్ - ఐరన్ మేన్ - బ్లాక్ విడో - హాకీ - లోకీ పాత టీం కాగా.. కొత్తగా డాక్టర్ స్ట్రేంజ్ - బ్లాక్ పాంథర్ - యాంట్ మేన్ - స్పైడర్ మేన్ వచ్చి జాయినయ్యారు.

గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ

ట్రయిలర్ చివర్లో గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ మూవీ సిరీస్ లో టీం మొత్తం కనిపించి హాయ్ చెప్పడం విశేషం. మొత్తానికి మార్వెల్ అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్ సినిమాలో ఏ ఒక్క సూపర్ హీరో క్యారెక్టర్ నీ వదలకుండా ఇందులో వాడేసింది. అవెంజర్స్ అభిమానులకు.. యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారిని మెప్పించేలానే సినిమా ఉంటుందని అర్ధమైపోతుంది. ట్రయిలర్ మొత్తం దాదాపుగా హీరోలందరినీ పరిచయం చేయడానికే సరిపోయింది.

English summary
When Marvel’s Avengers: Infinity War comes out in May, it will be the culmination of 10 years of Marvel moviemaking magic. And now we finally have a glimpse of the film, in the first official trailer for the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu