»   » 'ది గాడ్‌ఫాదర్' నటుడి మృతి... నివాళి

'ది గాడ్‌ఫాదర్' నటుడి మృతి... నివాళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజల్స్: ప్రముఖ హాలీవుడ్ నటుడు అలెక్స్ రొకో (79) శనివారం లాస్ ఏంజెలెస్ సమీపంలో స్టూడియో సిటీలోని తన నివాసంలో మృతి చెందారు. ఎంతోమంది సినిమావారికి ప్రేరణగా నిలిచిన 'గాడ్‌ఫాదర్' చిత్రంలో ఆయన కీలకమైన పాత్రలో కనిపించారు. ఆ సినిమాలో 'మో గ్రీన్' పాత్రలో ప్రేక్షకులను మెప్పించిన ఆయన, దాదాపు ఐదు దశాబ్దాల పాటు నటుడిగా రాణించారు. కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న రొకో ప్రశాంతంగా కన్నుమూసినట్లు ఆయన మేనేజర్ సుసాన్ జషరీ మీడియాకు వెల్లడించారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

కెరీర్ లో...

'The Godfather' actor Alex Rocco dead at 79

1965లో 'మోటార్ సైకో' చిత్రంతో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అలెక్స్ రొకో, 'గాడ్‌ఫాదర్' (1972) సూపర్ హిట్ అవటంతో ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్స్ ని ఏర్పరచుకున్నారు. 'గాడ్‌ఫాదర్'లో రొకో చెప్పిన 'యూ డోంట్ బై మీ ఔట్.. ఐ బై యూ ఔట్.. అండ్ డూ యూ నో హూ ఐయామ్..?' అనే డైలాగు చాలా పేరు తెచ్చి పెట్టింది.

ఆ తర్వాత ఆయన 'ది ఫ్రెండ్స్ ఆఫ్ ఎడ్డీ కోయల్', 'ఫ్రీబీ అండ్ ద బీన్', 'దట్ థింగ్ యూ డూ', 'ఎ బగ్స్ లైఫ్' వంటి చిత్రాల్లోనూ రొకో తన ప్రత్యేకతను చాటుకున్నారు.

పర్శనల్ లైఫ్..

మెసచుసెట్స్‌లోని కేంబ్రిడ్జ్‌లో 1936 ఫిబ్రవరి 29న పుట్టిన రొకో, 1960లలో సదరన్ కాలిఫోర్నియాకు మకాం మార్చారు. సినిమాల్లోకి రాకముందు కొద్దికాలం బార్‌టెండర్‌గా పనిచేశారు. హాలీవుడ్ నటి శాండీ ఎలైన్ గారెట్‌ను 1966లో పెళ్లాడారు. ఆమె 2002లో మరణించిన తర్వాత నటి షానన్ విల్‌కాక్స్‌ను పెళ్లాడారు. రొకోకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు.

English summary
Alex Rocco, the actor who played Moe Greene in "The Godfather," is dead at age 79.
Please Wait while comments are loading...