»   » నా కథని కాపీ చేసి నన్ను మోసం చేసారని కోర్టుకెక్కాడు

నా కథని కాపీ చేసి నన్ను మోసం చేసారని కోర్టుకెక్కాడు

Subscribe to Filmibeat Telugu

'ఆస్కార్'లో అవతార్ సినిమాకు చెక్ పెట్టగల ఏకైక సినిమా 'ది హర్ట్ లాకర్' సినిమా నిర్మాతకు వరుసబెట్టి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటీవలే అవతార్ కు కాకుండా తమ సినిమాకు ఓట్ చెయ్యమని ఆస్కార్ ఓటర్లకు మెయిల్ చేసి ఆస్కార్ అవార్డుల కార్యక్రమం నుండీ బహిష్కరించబడ్డ ఈ నిర్మాత ఇప్పుడు కొత్తగా కాపీ రైట్ ఆరోపణలతో సతమతమవుతున్నాడు. ఈ సినికా కథను నా నుండీ తీసుకుని నాకు తగినమొత్తం చెల్లించలేదని ఇరాక్ యుద్ధంలో బాంబ్ డిస్పోజల్ ఎక్స్ పర్ట్ జెఫ్రే సర్వెర్ ఆరోపనలు చేస్తున్నాడు.

ఇక ఈ సినిమా కథ ఇరాక్ యుద్ధంలో బాంబ్ డిస్పోజర్ గా పనిచేసే నిపుణిడి భావోద్వేగాలు ఎలా వుంటాయి అనే కథాంశం చుట్టూ తిరుగుతుంది. ఇందుకోసం ఈ సినిమా దర్శకురాలు క్యాథరీన్ బిగిలోవ్ ఇరాక్ లో రెండు నెలల పాటు వుండి అక్కడి పరిస్థితులను అవగాహన చేసుకొని ఈ సినిమాను రూపొందించారు. ఇకపోతే ఆమె నా కథనే సినిమాగా తీయడమే కాకుండా నాకు తగినమొత్తం ముట్టజెప్పుతామని చెప్పి ఇప్పుడు మోసం చేసారని అతను కోర్టుకెక్కాడు. ఈ సినిమా అవార్డుల పంట అయితే పండించుకుంది కానీ వసూళ్లలో ఇది అట్టర్ ఫ్లాప్ చిత్రం వసూళ్లని మించలేదు. మరి ఈ నేరం రుజువైతే నిర్మాత పరిస్థితి ఏంటో...!?

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu