»   » బ్రిటీషు అకాడమీ ఫిల్మ్ అవార్డుల నామినేషన్స్ లో దూసుకుపోతున్న హీరో

బ్రిటీషు అకాడమీ ఫిల్మ్ అవార్డుల నామినేషన్స్ లో దూసుకుపోతున్న హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు హాలీవుడ్ లో అవార్డుల పండుగ మొదలౌంతుంది. 2011 బ్రిటీషు అకాడమీ ఫిల్మ్ అవార్డుల నామినేషన్స్ అత్యధికంగా పోయిన సంవత్సరం విడుదలైనటువంటి ది కింగ్స్ స్పీచ్, బ్లాక్ స్వాన్ సినిమాలకు 15నామినేషన్స్ నమోదు కావడం జరిగింది. ఈరెండు సినిమాలకు ముఖ్యంగా బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డెరెక్టర్ విభాగాలలో పోటీ బాగా నెలకోని ఉంది. ఇది మాత్రమే కాకుండా ది కింగ్స్ స్పీచ్ సినిమాలో నటించినటువంటి హీరో కోలిన్ ఫిర్త్ కు బెస్ట్ యాక్టర్ అవార్డు వరించనుందని సమాచారం. అంతేకాకుండా బ్లాక్ స్వాన్ అనే సినిమాలో నటాలీ పోర్ట్ మెన్ కు బెస్ట్ యాక్టరస్ గా అవార్డు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు సినీ విశ్లేషకులు.

ఇక టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రిమో నటించినటువంటి ఇన్ సెప్సన్ అనే సినిమా 14ఎంట్రీస్ తో రెండవ స్దానంలో ఉంది. దీని తర్వాత బ్రటీష్ డ్రామా మేడ్ ఇన్ డాజిన్ హామ్ కూడా 1414ఎంట్రీస్ తో ఇన్ సెప్సన్ పోటా పోటీగా ఉంది. జనవరి 18వ తారీఖున విజేతలను అకాడమీ వారు ప్రకటించనున్నారు. ఇక ఈఅవార్డుల కార్యక్రమాన్ని లండన్ లో ఫిబ్రవరి 13వ తారీఖున ఘనంగా బ్రిటీషు అకాడమీ ఫిల్మ్ సంస్ద వారు నిర్వహించనున్నారు.

English summary
‘The King’s Speech’ and ‘Black Swan’ have earned 15 nominations each for 2011 British Academy Film Awards. Both films will compete in the Best Film and Best Director categories. Colin Firth (The King's Speech) and Natalie Portman (Black Swan) are hot favorites to land the Best Actor and Best Actress awards.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu