twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భారీ వసూళ్లతో ‘ది లయన్ కింగ్’ సరికొత్త బాక్సాఫీస్ రిపోర్ట్!

    |

    డిస్నీ సంస్థ నుంచి వచ్చిన యానిమేషన్ మూవీ 'ది లయన్ కింగ్' ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళుతోంది. తొలి రెండు రోజుల్లో రూ. 30 కోట్లు రాబట్టిన ఈ చిత్రం మూడో రోజైన ఆదివారం వసూళ్లు అదరగొట్టింది. అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ ఫస్ట్ వీకెండ్ రూ 50 కోట్లు రాబట్టింది.

    ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ 'ది లయన్ కింగ్' చిత్రానికి సంబంధించిన కలెక్షన్స్ గురించి ట్వీట్ చేశారు. 'ది జంగిల్ బుక్'(రూ. 40.19 కోట్లు) కంటే మంచి వసూళ్లు రాబట్టినట్లు తెలిపారు. లయన్ కింగ్ శుక్రవారం రూ. 11.06, శనివారం రూ. 19.15 కోట్లు, ఆదివారం రూ. 24.53 కోట్లు రాబట్టినట్లు తెలిపారు. దీంతో ఫస్ట్ వీకెండ్ టోటల్ రూ. 54.75 కోట్లకు రీచ్ అయింది.

    The Lion King Collects a whopping Rs. 54.75 CR in 3 DAYS

    ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ వీకెండ్ రూ. 50 కోట్ల మార్కును దాటిన మూడో చిత్రంగా రికార్డులకెక్కింది. ఇంతకు ముందు అవెంజర్స్-ది ఎండ్ గేమ్(రూ. 158.65 కోట్లు), అవెంజర్స్ ఇన్ఫినిటీవార్ (రూ. 94.30 కోట్లు) ఈ ఘనత సాధించాయి. ఇపుడు ది లయన్ కింగ్ రూ. 54.75 కోట్ల వసూళ్లతో వాటి తర్వాతి స్థానంలో నిలిచింది.

    ఈ చిత్రానికి జోన్ ఫావ్‌రో దర్శకత్వం వహించారు. 1994లో వచ్చిన 2డి యానిమేషన్ మూవీని అదే పేరుతో రీమేక్ చేశారు. అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డుల దర్శనమిస్తున్నాయి. భారత్‌ వ్యాప్తంగా ఈ చిత్రం 2140 స్క్రీన్లలో ప్రదర్శితమవుతోంది. యానిమేషన్ మూవీకి ఇంత అద్భుతమైన వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇండియాలో ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళంలో విడుదల చేశారు.

    నేటివిటీ ఎఫెక్ట్ కోసం లోకల్ స్టార్లతో డబ్బింగ్ చెప్పించడం సినిమాకు మరింత ప్లస్సయింది. ఈ చిత్రం‌లో అతి కీల‌క‌మైన ముఫాసా పాత్రకు హీందీలో షారుఖ్ ఖాన్‌, తెలుగులో పి.ర‌విశంక‌ర్ డ‌బ్బింగ్ చెప్పారు. హీరో సింబా పాత్ర‌కి హిందీలో షారుఖ్ ఖాన్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్ డబ్బింగ్ చెప్ప‌గా, తెలుగు‌లో నేచుర‌ల్ స్టార్ నాని చెప్పారు.

    విల‌న్ స్కార్ పాత్ర‌కి జ‌గ‌ప‌తి బాబు, టైమ‌న్ అనే ముంగిస పాత్ర‌కి ఆలీ, పుంబ అనే అడవి పంది పాత్ర‌కి ప్ర‌ముఖ హ‌స్య‌న‌టుడు బ్ర‌హ్మ‌నందం డ‌బ్బింగ్ చెప్పారు. డిస్నీ సంస్థ ఈ చిత్రాన్ని ప్రంపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేసింది. ఫస్ట్ వీకండ్ ప్రపంచ వ్యప్తంగా రూ. 3 వేల కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

    English summary
    The Lion King Collects a whopping Rs 65.19 CR GBOC (54.75 CR NBOC) IN 3 DAYS!!3rd highest all time opening record (3 Day Weekend Total) in #India after Marvel Studios' #AvengersEndgame and Avengers Infinity WarWatch #lionkingteluguIn ur nearest theater
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X