»   » ఒళ్ళు గగుర్పొడిచేలా.... మమ్మీ ట్రైలర్ చూసారా?

ఒళ్ళు గగుర్పొడిచేలా.... మమ్మీ ట్రైలర్ చూసారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

18ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్న 'మమ్మీ' ఫ్రాంచైజ్ లో మరో అధ్యాయం విడుదలకు సిద్ధమవుతోంది. టామ్ క్రూజ్ లీడ్ రోల్ చేస్తున్న ఈ మూవీ వేసవి కానుకగా వస్తోంది. 'ది మమ్మీ' పేరు వింటే తెలుగు వారి రోమాలు కూడా నిక్కబొడుచుకుంటాయి. 1999లో వచ్చిన ఈ ఫ్యాంటసీ, అడ్వెంచర్ మూవీని ఆస్వాదించే జనాలు ఇప్పటికీ పుష్కలంగానే ఉన్నారు.

ది మమ్మీ రిటర్న్ స్

ది మమ్మీ రిటర్న్ స్

ది మమ్మీ చిత్రం మే7 1999న విడుదలైంది. ఒక్క వారం రోజులలోనే అమెరికాలోని 3210 థియేటర్లలో $43 మిలియన్ డాలర్లు సాథించింది. ప్రపంచవ్యాప్తంగా $416 మిలియన్ డాలర్లు సాధించింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా "ది మమ్మీ రిటర్న్ స్" "ది మమ్మీ ది టూంబ్ ఆఫ్ డ్రాగన్ ఎంపరర్" చిత్రాలు వచ్చాయి అవి కూడా బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్ళు సాధించాయి. ఇప్పుడు అదే సిరీస్ లో భాగంగా మరో భాగమూ వచ్చేసింది.

ఈజిప్టు ఎడారిలో

ఈజిప్టు ఎడారిలో

ఈజిప్టు ఎడారిలో అట్టడుగున దాగున్న ఒక రాణి తాలూకు టూంబ్ ను కనుగొంటారు టామ్ క్రూజ్ అండ్ టీమ్. అయితే ఈ రాణి బతికొచ్చి.. తన మమ్మీకి పూర్తి రూపాన్ని ఆవహించుకుని.. ఇక పగ తీర్చుకుంటుంది. ఆ మమ్మీని హీరో అండ్ టీమ్ ఎలా ఎదుర్కొన్నారనేదే సినిమా.

 విజువల్ ఎఫెక్ట్స్

విజువల్ ఎఫెక్ట్స్

ఆ రాణి పాత్రలో ఫేమస్ డ్యాన్సింగ్ సెన్సేషన్ సోఫియా బౌటెల్లా నటించింది. ఆల్రెడీ జిమ్ ఫిజిక్ తో ఇరగదీసే సోఫియా.. ఈ పాత్రలో విలనీతో పాటు గ్లామర్ కూడా గాట్టిగానే దారబోసిందిలే. ఇక హీరోయిన్ గా అన్నాబెలి వాలిస్ నటించింది. గతంలో మనం చూసిన ఇసుక తుఫానులో ముఖం చూపించి నోటితో మింగేసే ఎఫెక్ట్.. అలాగే ఎగిరే గబ్బిళాలూ.. ఇలా చాలా విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాలో కూడా అదరిపోయాయని ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది.

టామ్ క్రూజ్ లీడ్ రోల్‌

టామ్ క్రూజ్ లీడ్ రోల్‌

'ది మమ్మీ' పేరిటే రిలీజ్ అవ్వబోతున్న ఈ చిత్రంలో హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ లీడ్ రోల్‌లో కనిపించనుండగా.. ఈ సారి ఓ ఆడ మమ్మీ అందంగా భయపెట్టబోతోంది. ఇటీవలే విడుదలైన 'ది మమ్మీ' ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎనలేని ఆసక్తిని రేకెత్తిస్తోంది.

rn

సోఫియా బౌటెల్లా

ఈ ఫ్రాంచైజ్‌లో ఇప్పటివరకూ విడుదలైన చిత్రాల్లో దాదాపూ అన్నీ ప్రేక్షకుల మెప్పు పొందినవే కావడంతో.. తాజా చిత్రంపైనా ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక.. 'మిషన్ ఇంపాజిబుల్', 'ట్రాన్స్‌ఫార్మర్స్' వంటి చిత్రాలకు రైటర్‌గా పనిచేసిన అలెక్స్ కర్ట్స్‌మెన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. సోఫియా బౌటెల్లా మమ్మీగా అలరించబోతోంది. మరి జూన్ 9న విడుదలకు సిద్ధమవుతున్న 'ది మమ్మీ' ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

English summary
This June, "The Mummy" starring Tom Cruise and Russell Crowe will become the first film release from the 2017 Universal Monsters Movie Universe series, which will see the remake of a handful of classic thriller movies.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu