»   » అలనాటి క్లాసికల్ చిత్రాల ప్రదర్శనకు సిద్దం పివిఆర్ మరియు ఐనాక్స్ ధియేటర్లు

అలనాటి క్లాసికల్ చిత్రాల ప్రదర్శనకు సిద్దం పివిఆర్ మరియు ఐనాక్స్ ధియేటర్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

పాత సినిమాలు అంటే చాలా మందికి అమితమైన అభిమానం ఉంటుంది. గతంలో వచ్చినటువంటి క్లాసికల్ సినిమాలు ఎప్పుడైనా టివిలలో వస్తే మాత్రం అతుక్కుపోయిమరి మనలో చాలా మంది చూస్తుంటారు. ఆరోజుల్లో సినిమా తీసినటువంటి విధానం కానివ్వండి లేక ఎటువంటి విజువల్ ఎఫెక్ట్సు లేకుండా హీరోలు చేసినటువంటి సాహాసాలు కానివ్వండి మనల్ని చాలా ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి.

తిరిగి హాలీవుడ్ క్లాసికల్ సినిమాలకు జీవం పోయాలనే ఉద్దేశ్యంతో భారతదేశంలో రే బాన్ ఆధ్వర్యంలో క్లాసికల్ ఫిలిం ఫెస్టివల్ నవంబర్ 26నుంచి డిసెంబర్ 23వ తారీఖు వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలనాటి పాత చిత్రాలనుండి మంచి క్లాసికల్ సినిమాలను వారం రోజులపాటు భారతదేశంలోని అన్ని ఐనాక్స్ మరియు పివిఆర్ సినిమాస్ లలో ప్రదర్శించనున్నట్లు తెలిపారు.

దీని ద్వారా ఎప్పుడో తీసినటువంటి పాత సినిమాలను మనం అందరం టివిలలోనో లేక డివిడిలలోనో చూడడం జరిగింది. ఇప్పుడు అలాంటి సినిమాలను డైరెక్టుగా 70యమ్ యమ్ స్క్రీన్స్ మీద చూడడమే కాకుండా ఆఅనుభూతిని మరలా మనం అందరం నెమరువేసుకోవడానికి గుర్తుగా ఉంటుందని అన్నారు. ఇక ఈవారం రోజులు ఫిలిం ఫెస్టివల్ లోఅలనాటి క్లాసికల్ సినిమాలు అయినటువంటి ది ఇటాలియన్ జాబ్, ది గాడ్ ఫాదర్, బ్రేక్ ఫాస్ట్ టిఫ్పన్నీస్ లాంటి అధ్బుతదమైన ఖలాఖండాలను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. అప్పుడప్పుడు ఇలాంటివి చేయడం వల్ల గత స్మృతులను నెమరువేసుకున్నట్లుగా ఉంటుదని పలువురు అభిప్రాయపడ్డారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu