»   » హాలీవుడ్ ‘అవతార్’ సీక్వెల్స్ రిలీజ్ డేట్స్ వచ్చేసాయి...

హాలీవుడ్ ‘అవతార్’ సీక్వెల్స్ రిలీజ్ డేట్స్ వచ్చేసాయి...

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన 'అవతార్' 2009లో విడుదలైన సంచలన విజయం సాధించి సంగతి తెలిసిందే. ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి ఇప్పటికే అవతార్ 2 రావాల్సి ఉన్నా.... సాంకేతిక కారణాలతో సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది.

ఎట్టకేలకు 'అవతార్-2' రిలీజ్ డేట్ ఖరారైంది. డిసెంబర్ 18, 2020లో నెక్ట్స్ సీక్వెల్ విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో పాటు 3, 4, 5 సీక్వెల్స్ రిలీజ్ డేట్ కూడా ప్రకటించేసారు.

మిగతా సీక్వెల్స్ రిలీజ్ డేట్స్ ఇవే..

మిగతా సీక్వెల్స్ రిలీజ్ డేట్స్ ఇవే..

ఏడాదికో సినిమా చొప్పున ఇక వరుస ‘అవతార్' సీక్వెల్స్ ప్రపంచ ప్రేక్షకులను అలరించబోతున్నాయి. అవతార్ 2 డిసెంబర్ 18, 2020న రిలీజ్ అవుతుండగా, డిసెంబర్ 17, 2021న మూడో అవతార్, డిసెంబర్ 20, 2024న నాలుగో అవతార్, డిసెంబర్ 19, 2025 ఐదో అవతార్ సీక్వెల్ రాబోతున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది.

ఆలస్యానికి కారణం ఇదే

ఆలస్యానికి కారణం ఇదే

సినిమా ఆలస్యానికి కారణం అవతార్ ఎంటైర్ టీమ్ ఇంతకాలం కేవలం పార్ట్ 2 కోసమే కాకుండా.... భవిష్యత్తులో రాబోయే అన్ని సీక్వెల్స్ మీద ఒకేసారి పని చేస్తున్నారు. అందుకే మొదటి పార్ట్ రిలీజైన 11 సంవత్సరాల తర్వాత రెండో పార్ట్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మీరు ఊహించని విధంగా

మీరు ఊహించని విధంగా

అవతార్ తొలి పార్ట్ చూసే ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. కాబోయే నాలుగు పార్టులు ప్రపంచ సినీ ప్రేక్షకులను మరింత సంబ్రమాశ్చర్యాలకు గురి చేయబోతోంది. ఎవరూ ఊహించని సాంకేతిక పరిజ్ఞానం, విజువల్ ఎఫెక్ట్స్ రాబోయే సీక్వెల్స్ లో మనం చూడబోతున్నాం.

జేమ్స్ కామెరూన్

జేమ్స్ కామెరూన్

ఇక తన కెరీర్‌లో కేవలం అవతార్ సినిమాలు మాత్రమే తీస్తానని, అవతార్ ఐదో భాగం తీసే సమయాని నా జీవితం చివరి దశకు చేరుకుంటుంది, తర్వాత విశ్రాంతి తీసుకుంటానని జేమ్స్ కామెరూన్ అంటున్నారు. ప్రస్తుతం జేమ్స్ కామెరూన్ వయసు 62 సంవత్సరాలు.

English summary
Follow-ups to the highest-grossing movie of all time were originally slated to start coming out next year. But recent statements by director James Cameron disclosed that there’d be a delay for the coming wave of Avatar sequels. Now we know the exact dates that Cameron and his team are aiming for, starting with December 18, 2020. The journey continues December 18, 2020, December 17, 2021, December 20, 2024 and December 19, 2025!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu