»   » సినిమాగా అమెరికా ప్రెసిడెంట్ ప్రేమ కథ...ఫస్ట్ లుక్

సినిమాగా అమెరికా ప్రెసిడెంట్ ప్రేమ కథ...ఫస్ట్ లుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్ ‌: ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహించే...అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, ఆయన భార్య మిషెల్‌ల ప్రేమ కథ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఫొటో విడుదల చేసారు. ఆ ఫోటో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ ఫోటోని ఈ చిత్రం నిర్మిస్తున్న సంస్ధ ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది. మీరూ ఇక్కడ చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇంతకీ ఆ ఫొటో లో ఏముందీ అంటారా.? ఆ సినిమాలో ఒబామా, మిషెల్‌ మొదటిసారి కలుసుకున్నప్పటి ఫొటో అది. రిచర్డ్‌ టానే అనే దర్శకుడు తానే సొంతంగా కథ రాసి 'సౌత్‌సైడ్‌ విత్‌ యూ' పేరుతూ హాలీవుడ్‌లో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఇందులో పార్కర్‌ సాయర్‌ ఒబామా పాత్ర పోషిస్తుండగా, టికా సంప్టర్‌ మిషెల్‌ పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు వీరి ఫొటోనే ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తోంది. హాలీవుడ్‌లో హోమ్‌గ్రోన్ పిక్చర్స్ పతాకంపై రూపొందిస్తున్నారు.

ఈ సినిమాలో 1989లో మిషెల్లి - ఒబామాల ప్రేమ ఎలా మొదలైంది... వారి డేటింగ్, ఆ తర్వాత వివాహం తదితర అంశాల ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని రూపుదిద్దుతున్నట్లు డెడ్‌లైన్ పత్రిక వెల్లడించింది.

The Obamas’ first date recreated for ‘Southside With You’

వారి కథనం ప్రకారం ...చికాగోలోని ఆర్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో మొదటి సారి ఒబామా-మిషెల్ కలిసారని, ఇద్దరూ కలిసి లాంగ్ వాక్ చేసి స్పైక్ లీ డైరక్ట్ చేసిన ‘Do The Right Thing ' అనే చిత్రం చూసారు. ఈ విషయాన్ని 2012లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఒబామా వెల్లడించారు. ఈ సంఘటనలు కూడా ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయని నిర్మాత తెలిపారు.

ఒబామా అప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 'ఆమెకు బాస్కిన్‌ అండ్‌ రాబిన్స్‌లోని అత్యంత రుచికర మైన ఐస్‌ క్రీమ్‌ తెప్పించా, చివరకు ఆమెను ముద్దు పెట్టుకుంటే ఆమె చాక్‌లేట్‌లా అనిపించింది' అని చమత్కరించారు.

ఒబామా పాత్రకు సంగీత కళాకారుడు డ్రేక్‌, నటుడు మైకేల్‌ బి జోర్డన్‌, సాటర్‌డే నైట్‌ లైవ్‌ షో వ్యంగ్య కార్యక్రమంలో ఒబామా పాత్ర ధరించే జే ఫారో పేర్లు వినవస్తున్నాయి. మిషెల్‌ 25 ఏళ్ల వయసులో చికాగో లోని ప్రతిష్ఠాత్మక సిడ్లే అండ్‌ ఆస్టిన్‌ సంస్థలో అటార్నీగా పని చేసే వారు. ఒబామా కూడా అక్కడే సమ్మర్‌ అసోసియేట్‌గా పని చేసేవారు. అప్పుడు ఆయన వయసు 27 ఏళ్ళు.

English summary
The first on-set photo from “Southside With You,” an upcoming romantic drama which recreates President Barack Obama and first lady Michelle Obama’s first date together in the Windy City, has been released.
Please Wait while comments are loading...