»   » క్లైమాక్స్ రాయడానికి భయపడ్డ సినీ దర్శకుడు.. గుండె నిబ్బరం.. ప్రాణాలు అరచేతిలో..

క్లైమాక్స్ రాయడానికి భయపడ్డ సినీ దర్శకుడు.. గుండె నిబ్బరం.. ప్రాణాలు అరచేతిలో..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా క్లైమాక్స్ అదిరిపోతే బంపర్ హిట్ ఖాయమని చెప్తుంటారు. సినిమా హిట్టా? ఫ్లాఫా? అనేది నిర్ణయించేంది చిత్ర క్లైమాక్సే. అలాంటి క్లైమాక్స్ రాయడానికి హాలీవుడ్ దర్శకుడు ఎం నైట్ శ్యామలన్ తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకొన్నాడట. క్లైమాక్స్ రాయడం ఆపివేసి పారిపోయేంత పనిచేశాడట. ఈ ఆశ్చర్యకరమైన సంఘటనను శ్యామలన్ ఇటీవల టిట్టర్ ద్వారా పంచుకొన్నారు.

స్ల్పిట్ సీక్వెల్‌కు క్లైమాక్స్

స్ల్పిట్ సీక్వెల్‌కు క్లైమాక్స్

సస్పెన్స్, థ్రిల్లర్ చిత్రాలను తీయడంలో శ్యామలన్‌ది ప్రత్యేకమైన శైలి. స్ప్లిట్ అనే చిత్రంతో భారీ విజయాన్ని సాధించాడు. ప్రస్తుతం దానికి కొనసాగింపుగా స్ల్పిట్2 కోసం స్క్రిప్ట్ రాస్తున్నట్టు సమాచారం. ‘కొత్త సినిమా క్లైమాక్స్ రాసే పనిలో ఉన్నాను. ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతున్నాను. సినిమాలో పాత్రలు చాలా భయపెట్టేలా ఉన్నాయి. వాటి వల్ల ఆందోళన చెందుతున్నాను. రాయడం అంటే నటించడంతో సమానం అనే ఫిలింగ్ కలుగుతుంది అని ఆయన ట్వీట్ చేశారు.

స్ప్లిట్ రికార్డు స్థాయి వసూళ్లు

స్ప్లిట్ రికార్డు స్థాయి వసూళ్లు

జేమ్స్ మెక్అవోయ్ (హోర్డే పాత్రలో) హీరోగా నటించిన స్ప్లిట్ చిత్రానికి శ్యామలన్ దర్శకత్వం వహించారు. ఆ చిత్రంలో 23 రకాల మనస్తత్వాలు కలిగి ఉన్న సీరియల్ కిల్లర్‌గా జేమ్స్ నటించాడు. ఈ చిత్రం ప్రేక్షకులను థ్రిల్ గురి చేసింది. సినిమా హిట్ కావడంతో మళ్లీ సైకలాజికల్ హారర్ చిత్రాన్ని అందిస్తానని చెప్పారు. స్ల్పిట్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 273 మిలియన్ డాలర్లను వసూలు చేసింది.

భారత సంతతికి చెందిన..

భారత సంతతికి చెందిన..

భారత సంతతికి చెందిన నైట్ శ్యామలన్ సినిమా దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా, నటుడిగా హాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడు. ఆయన తీసిన ది సిక్త్ సెన్స్ (1999), అన్‌బ్రేకబుల్ (2000) హాలీవుడ్‌లో భారీ విజయాలు సాధించాయి. ఆ తర్వాత సైన్స్ ఫిక్షన్ సైన్స్ (2002), ది విజిట్ (2015), స్ప్లిట్ (2016) తీశాడు.

ది సిక్త్ సెన్స్‌తో హాలీవుడ్‌లో హవా

ది సిక్త్ సెన్స్‌తో హాలీవుడ్‌లో హవా

పాండిచ్చేరికి చెందిన నైట్ శ్యామలన్ న్యూయార్క్ యూనివర్సిటీలో చదువుతుండగా ప్రేయింగ్ విత్ యాంగర్ అనే సినిమాను తీశాడు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకొన్నది. ఆ తర్వాత తీసిన ది సిక్త్ సెన్స్ సూపర్ డూపర్ హిట్ కావడంతో హాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుల జాబితాలో చేరిపోయాడు.

English summary
Filmmaker M Night Shyamalan says he had to move away while he was writing the ending of his new film as he feared for the characters of his plot. "Writing climax of the new film. Had to step away. Heart pounding. Too scared and worried for the characters. Writing really is like acting," Shyamalan tweets..
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu