twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    The Ten Commandments 65 ఏళ్ల తర్వాత రీమేక్.. డిసెంబర్ 31 రిలీజ్‌కు సిద్ధం

    |

    ప్రపంచ సినిమా చరిత్రలో ది టెన్ కమాండ్‌మెంట్స్ సినిమాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. 1956లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను కొత్త అనుభూతికి గురి చేసింది. ఈ చిత్రంలో మోషేగా చార్లటన్ హెస్టన్, రామేసెస్‌గా యల్ బ్రైనెర్ నటించి ప్రేక్షకుల ఆదరణను సంపాదించుకొన్నారు. మేరి పేరెంట్, కాలే బాయ్‌టెర్ నిర్మించారు. రెమెసెస్ పాలనలో జేవిష్ ప్రజల నుంచి విముక్తుడైన మోషే కథ ఆకట్టుకొనేలా తెరకెక్కింది. ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చిన కథ వెండితెర అద్భుతంగా కనిపిస్తుంది. అలాంటి గొప్ప చిత్రం మరోసారి నూతన సంవత్సర కానుకగా విడుదలకు సిద్దమైంది.

    అమెరికా సినిమా పితామహుడు, హాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ నిర్మాత, ప్రొడ్యూసర్ సెసిల్ బీ డెమిల్లే ది టెన్ కమాండ్‌మెంట్స్ సినిమాను 220 నిమిషాల నిడివితో తెరకెక్కించారు. ఈ చిత్రం ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి మెట్రో నగరాలలో 50 వారాలకుపైగా ప్రదర్శితమైంది.

    The Ten Commandments movie remake to release December 31st

    ప్రస్తుతం టెన్ కమాండ్‌మెంట్స్ సినిమాను రీమేక్ చేసి ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ పారమౌంట్ పిక్చర్స్ ప్రేక్షకులకు అందించబోతున్నది. 65 సంవత్సరాల తర్వాత అద్భుతమైన చిత్రాన్ని రీమేక్ చేయడం గమనార్హం. మోషే పాత్రలో మిషన్ ఇంపాజిబుల్ 2, బాట్‌ ఉమన్ 2022 ఫేమ్ డౌగ్రే స్కాట్ నటించారు. ఈ చిత్రం నూతన సంవత్సర కానుకగా డిసెంబర్ 31న తెలుగు, తమిళం, ఆంగ్ల భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్నది.

    The Ten Commandments movie remake to release December 31st

    ఇంకా ఈ చిత్రంలో ఆరోన్‌గా లినస్ రోచ్, మెనెరిత్‌గా నవీన్ ఆండ్రూస్, జిప్పోరాగా మియా మాస్ట్రో, రామ్‌సెస్‌గా పాల్ రైస్, అనందర్‌గా రిచర్డ్ ఓబ్రెయిన్, జెరెడ్‌గా సిలాస్ కార్సన్, యువరాణి బిథియాగా పద్మా లక్ష్మి, మిరియమ్‌గా సుసాన్ లించ్, రాణిగా క్లైరే బ్లూమ్, ఇంకా జెత్రోగా ఒమర్ షరీఫ్ నటించారు. రాబర్ట్ డోర్న్‌హెల్మ్, జెఫ్రీ మడేజా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జేసన్ కామియోలో, రాండీ ఎడెల్‌మాన్ సంగీతం, ఎడ్వర్డ్ జె పేయ్ సినిమాటోగ్రఫీ అందించారు.

    English summary
    The Ten Commandments movie remake to release December 31st. 1956 American epic religious drama film produced, directed, and narrated by Cecil B. DeMille is remaked after 65 years.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X