చాలా కాలానికి హిట్ టాక్ : మనోజ్ శ్యామలన్ లేటెస్ట్ ఫిల్మ్
లాస్ ఏంజిల్స్ : ఈ మధ్య కాలంలో వరస ఫ్లాఫులు ఎదుర్కొన్న మనోజ్ నైట్ శ్యామలన్‌కు మళ్లీ కాలం కలిసి వస్తున్నట్లే ఉంది.

కేవలం 5 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో ఆయన తీసినది 'ది విజిట్ ' బాగా ఆడుతోంది. ఇప్పటికే 66 మిలియన్ డాలర్‌లను కలెక్ట్ చేసి, ఇంకా మంచి కలెక్షన్లతో ముందుకెడుతోంది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ మనోజ్ ఓ ట్వీట్ చేసారు దాన్ని ఇక్కడ చూడండి.
తక్కువ ఖర్చుతో సినిమా తీయాలనేది బ్లమ్ హౌస్ ప్రొడక్షన్ వాళ్ల పాలసీ, ఆ ప్రకారమే, మనోజ్ నైట్ శ్యామలన్ 'ది విజన్' సినిమాను కేవలం రెండే లొకేషన్‌లలో (పెన్సీల్వేనియాలో ఒక ఫార్‌మహౌస్‌లో, ఫ్రాలిడాలో ఒక హౌటల్ రూమ్‌లో) మాత్రమే షూట్ చేశాడు . ఆ ట్రైలర్ ని ఇక్కడ చూడండి.
అతి తక్కువ లొకేషన్‌లతో, ఎక్స్‌ట్రాలు(జూనియర్ ఆర్టిస్టులు) మాట్లాడకుండా కాల్ షీట్ సమయానికి జూనియర్ ఆర్టిసులకు ఇచ్చేది 100 డాలర్లు మాత్రమే. వాళ్ళు ఒక్క కాల్‌షీట్ సమయంలో ఒక్కమాట మాట్లాడినా 400 డాలర్‌ల అధిక పారితోషికం ఇచ్చి తీరాలనేది హాలివుడ్ రూలు.

manoj night shyamalan twitter the visit hollywood మనోజ్ నైట్ శ్యామలన్ ట్విట్టర్ ది విజిట్ హాలీవుడ్


Click it and Unblock the Notifications