»   » మార్వెల్ స్టూడియోస్ మరో అద్భుతం.... థోర్-3 (ట్రైలర్)

మార్వెల్ స్టూడియోస్ మరో అద్భుతం.... థోర్-3 (ట్రైలర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్‌ఏంజిల్స్: హాలీవుడ్లో మార్వెల్ స్టూడియో వారు వేల కోట్ల ఖర్చుతో నిర్మించే చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్పైడర్ మెన్, ఐరన్ మెన్, అవేంజర్స్, కెప్టెన్ అమెరికా ఇలా ఈ సంస్థ నుండి వచ్చే సినిమాలన్నీ విజువల్స్ పరంగా ఎంతో అద్భుతంగా ఉంటాయి.

ఈ సంస్థ నిర్మిస్తుస్తున్న చిత్రాల్లో 'థోర్' సిరీస్ సినిమాల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇప్పటికే విడుదలైన రెండు పార్ట్స్ బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా మూడో భాగం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.

‘థోర్: రగ్నరోక్'

‘థోర్: రగ్నరోక్' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్ తాజాగా రిలీజైంది. ‘థోర్' గత రెండు సిరీస్ చూసిన వారికి ఈ సినిమా సరికొత్త అనుభూతిని ఇస్తుందని ఈ ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.

క్రిస్ హెమ్స్‌వర్త్

క్రిస్ హెమ్స్‌వర్త్

తొలి రెండు పార్ట్స్ లో హీరోగా నటించిన క్రిస్ హెమ్స్‌వర్త్ ఈ చిత్రంలో హీరోగా నటించాడు. చేతిలో సుత్తి లాంటి ఆయుధంతో హీరో చేసే విన్యాసాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.

ప్రధాన తారాగణం

ప్రధాన తారాగణం

క్రిస్ హెమ్స్‌వర్త్
టామ్ హిడిల్టన్
కేట్ బ్లాంచెట్
ఐద్రస్ ఎల్బా
జెఫ్ గోల్ద్బ్లం
టెస్సా థాంప్సన్
కార్ల్ అర్బన్
మార్క్ రఫ్ఫలో
ఆంథోనీ హాప్కిన్స్

రిలీజ్ డేట్

రిలీజ్ డేట్

వాల్ డిస్నీ సంస్థ ఈ ఏడాది నవంబర్ 3న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి Taika Waititi దర్శకత్వం వహిస్తున్నారు.

English summary
Thor: Ragnarok is an upcoming American superhero film based on the Marvel Comics character Thor, produced by Marvel Studios and distributed by Walt Disney Studios Motion Pictures.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu