»   » 'లైఫ్ ఆఫ్ పై' కేసు : పులిని హింసించిన సాక్ష్యం (వీడియో)

'లైఫ్ ఆఫ్ పై' కేసు : పులిని హింసించిన సాక్ష్యం (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: ఆస్కార్‌ పురస్కార విజేత ఆంగ్‌ లీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'లైఫ్‌ ఆఫ్‌ పై'. ఈ సినిమాలో హీరో 'పై పటేల్' తోపాటు 'రిచర్డ్ పార్కర్' గా నటించిన పులి కూడా అందర్నీ అమితంగా ఆకట్టుకుంది. అయితే ఆ పులి గురించిన ఓ నిజం బయిటకు వచ్చింది. చాలా కాలంగా ఆ పులి అనుభవిస్తున్న హింస వెలుగులోకి వచ్చింది.

ప్రస్తుతం కెనడాలోని ఒంటారియోలో గల ఓ జూలో నివసిస్తున్న పులిని.. దాని సంరక్షకుడే హింసించిన వీడియోను ప్రఖ్యాత జంతుసంరక్షణ సంస్థ పెటా వెలుగులోకి తెచ్చింది. ఆ వీడియో ఇక్కడ చూడండి.

సొంతగా జూపార్క్ ను నడిపే మిచెల్ హాకెన్ బర్గర్ అనే పెద్దమనిషే అక్కడి జంతువులకు ట్రైనింగ్ ఇస్తూఉంటాడు. 'లైఫ్ ఆఫ్ పై'లో నటించేందుకు యునో(పులి పేరు)కు శిక్షణ ఇచ్చింది కూడా ఆయనే. జంతుశిక్షకుడిగా మిచెల్ కు ఉన్న పేరు కన్నా ... ఎక్కువ ఆరోపణలున్నాయి. ఆయన జంతువులను విపరీతంగా హింసిస్తాడని పెటా మెదటినుంచి గొడవ చేస్తూనే ఉంది.

తాజాగా సీక్రెట్ గా షూట్ చేసినన ఓ వీడియోలో ఆ ఆరోపణలు నిజమేనని తేలింది. కొరడాతో పులిని పదేపదే కొడుతూ, పచ్చిబూతులు తిట్టడమంతా వీడియోలో రికార్డయింది.

Tiger Trainer Allegedly Caught on Video Whipping Animal

అంతేకాదు 'పులి నొటిపై, కాళ్లమీదా కొడితే నాకు ఆనందం కలుగుతుంది' అని మిచెల్ మాటలు వీడియోలో స్పష్టంగా వినిపించాయని, వీటి ఆధారంగా ఆయనపై కేసు పెట్టనున్నట్లు పెటా సంస్థ డిప్యూటీ డైరెక్టర్ బ్రిట్టానీ పీట్ మీడియాకు చెప్పారు. అయితే హాకెన్ బర్గర్ ఇవన్నీ ఒట్టి ఆరోపణలే అంటూ ఖండిస్తూ ఓ వీడియోని సైతం విడుదల చేసారు. ఆ వీడియోను మీరు ఇక్కడ చూడవచ్చు.

లైఫ్ ఆఫ్ పై చిత్రం కథ ఏమిటంటే - సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక పెద్ద షిప్ మునిగిపోగా అందులో నుంచి బతికిన పై అనే 16 సంవత్సరాల యువకుడు అక్కడి నుండి ఒక చిన్న పడవలో పై తో పాటు ఒక బెంగాల్ టైగర్, ఒక కోతి, ఒక జీబ్రా మరియు ఒక హైనాలతో అతని జర్నీ ఎలా సాగింది అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. పాండిచ్చేరికి చెందిన పై పటేల్‌ అనే అబ్బాయి, రిచర్డ్‌ పార్కర్‌ అనే పులితో కలిసి దాదాపు 227 రోజులు పసిఫిక్‌ మహా సముద్రంలో ప్రయాణించాల్సి వస్తుంది. సాహసోపేత ప్రయాణమే ఈ చిత్రం.

English summary
Horrifying moment Life of Pi animal trainer is caught on camera 'savagely beating a young Siberian tiger on the face and body with a whip'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu