»   »  తల్లే రెండేళ్లు చిన్నది.. ఇక ఆమె కూతురితో డేటింగా.. రొమాంటిక్ హీరో లిస్టులో 12 మంది!

తల్లే రెండేళ్లు చిన్నది.. ఇక ఆమె కూతురితో డేటింగా.. రొమాంటిక్ హీరో లిస్టులో 12 మంది!

Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్ హీరో, టైటానిక్ హీరో లియోనార్డో డెకాప్రియో సినీ అభిమానులందరికి తెలిసేఉంటాడు. అద్భుతమైన నటనతో ఆస్కార్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. కానీ ఈ రొమాంటిక్ హీరో రియల్ లైఫ్ రొమాన్స్ గురించి తెలిస్తే కంగుతినాల్సిందే. 1997 నుంచి ఇప్పటివరకు ఈ హీరో మొత్తం 12 మంది అమ్మాయిలతో రాసలీలలు జరిపాడు. వారందరితో ఆతడి సహజీవనం చేసినట్లు తెలుస్తోంది.

బ్యాచులర్ జీవితం ఇలాగే బావుందని భావించాడో ఏమో కానీ లియోనార్డో 43 ఏళ్ళు వచ్చినా ఇంత వరకు వివాహం చేసుకోలేదు. తాజాగా లియోనార్డో తనకన్నా 23 ఏళ్ళు చిన్నదైనా కమిలా అనే యువతితో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కడకు వెళ్లినా వీరిద్దరూ చెట్టా పట్టాలు వేసుకుని వెళుతుండడంతో హాలీవుడ్ లో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. లియోనార్డో డేటింగ్ చేస్తున్న కమిలా తల్లి కూడా అతడికన్నా రెండేళ్లు చిన్నది కావడం విశేషం.

 Titanic hero Leonardo DiCaprio new girlfriend became sensation

లియోనార్డో రొమాంటిక్ లైఫ్ లో చేదు అనుభవాలు కూడా ఉన్నాయి. 2010 లో లియోనార్డో మోడల్ విల్సన్ తో కొంతకాలం ఘాటు వ్యవహారం సాగింది. కొంతకాలానికి వారి మధ్య విభేదాలు తలెత్తడం, విల్సన్ బాటిల్ తో లియోనార్డో తలపైకొట్టడం వంటి ఘటనలు జరిగాయి. ఈ కేసులో విల్సన్ కు జైలు శిక్ష కూడా పడింది.

English summary
Titanic hero Leonardo DiCaprio new girlfriend became sensation. She is 12 th girlfriend of DiCaprio
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X