»   » ప్రపంచంలోని ఎత్తైన భవనం బుర్జ్ ఖాలిఫా నుండి స్టంస్ట్స్..సిద్దమైన హీరో..!

ప్రపంచంలోని ఎత్తైన భవనం బుర్జ్ ఖాలిఫా నుండి స్టంస్ట్స్..సిద్దమైన హీరో..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన భవనం ఇటీవల కాలంలో దుబాయిలో నిర్మించిన సంగతి తెలిసిందే. ఈభవనం పేరు బుర్జ్ ఖాలిఫా. ఈసౌధం ప్రారంభోత్సవం అతిరధుల సమక్షంలో ఇటీవలే జరిగింది. ఇప్పుడు ఈ బుర్జ్ ఖాలిఫా గురించి మనం మాట్లాడుకోవడానికి కారణం ఈ బుర్జ్ ఖాలిఫా మీద హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ తన మిషన్ ఇంపాజబుల్-4 చిత్రం కోసం స్టంట్స్ తీయనున్నారని సమాచారం.

హాలీవుడ్ లో అభిమానుల కోసం ఎంతటి సాహాసాన్నిఅయిన అవలీలగా చేయడంలో దిట్ట మన టామ్ క్రూజ్. ఈసినిమాకి గాను టామ్ క్రూజ్ ఈభవనంపై నుండి 2,717 అడుగుల ఎత్తునుండి చేయనున్న స్టంట్స్ ఈవారంలో తీయనున్నట్లు దర్శకుడు వివరించారు. ఇక ఈశనివారం దుబాయిలో ఈస్టంట్స్ కోసం టామ్ క్రూజ్ అభిమానులు మరియు ఫోటోగ్రాఫర్స్ ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.

టామ్ క్రూజ్ కిటికీలలో నుంచి పరిగెత్తుకుంటూ 124అంతస్తునుండి కిందకు దూకడంతో స్టంట్ మొదలవుతుందని, దీనికి సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలు ముందుగానే తీసుకోవడం జరిగిందన్నారు. ఈవిషయంపై టామ్ క్రూజ్ మాట్లాడుతూ నాజీవతంలో నాఎదుగుదలకు నాఅభిమానులు నాకు ఎంతగానో సహాకరించారు. అలాంటి అభిమానులను ఆనందపరచడం కోసం నేను ఏమిచేయడానికైన సిద్దమేనని అన్నారు. గతంలో వచ్చినటువంటి సిరిస్ లమాదిరే ఇదికూడా బాక్సాఫీస్ రికార్డుల్ని బద్దలు కోట్టే విధంగా ఉంటుందని అన్నారు. ఇక ఈసినిమా విషయానికి వస్తే నేను ఇందులో ఏజెంట్ పాత్రలో కనిపిస్తానన్నారు. ఈచిత్రాన్ని వచ్చే సంవత్సరంలో మొదట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.

ఈచిత్రంలో టామ్ క్రూజ్ తోపాటు ఆస్కార్ అవార్డు గెలుచుకున్నటువంటి చిత్రం హార్ట్ లాకర్ సినిమా హిరో జెరిమి రెన్నర్ కూడా ఓముఖ్యమైన భూమికను పోషించనున్నారు. జెరిమి రెన్నర్ నటనను తాను హార్ట్ లాకర్ సినిమాలో చూశానని, టామ్ క్రూయిజ్ ప్రక్కన తను ఐతే బాగుంటుందని ఆయన అన్నారు. అంతేకాకుండా జెరిమి రెన్నర్ తో పాటు ఈ సినిమాలో ఇంకోక హీరోని కూడా తీసుకోనున్నట్లు ఇటీవలే సినిమా దర్శకుడు ప్రకటించారు.

ఇదిలా ఉండగా 'మిషన్ ఇంపాజబుల్-4' హీరో టామ్ క్రూజ్ ప్రధాన పాత్రలో రూపొందబోయే మిషన్ ఇంపాజబుల్ సీక్వెన్స్ లో ఆయన భార్య, హాలీవుడ్ సెక్సీ నాయిక క్యాటీ హాల్మస్ ప్రతినాయికగా నటించనున్నారు. ఈ సమాచారం ప్రకారం టామ్ క్రూజ్ కు ఎంతో పేరు తెచ్చిపెట్టిన 'మిషన్ ఇంపాజబుల్' సినిమా తాజా సీక్వెల్ లో టామ్ తన సహచరిణి క్యాటీతో రొమాన్స్ చెయ్యడానికి సిద్ధంగా లేడట. దీంతో ఆమెను ప్రతినాయికగా నటింపజేయనున్నట్టు తెలిసింది. ఇంతకు మునుపు వీరు నాయికా-నాయకులుగా నటించిన విషయం తెలిసిందే. దీంతో నాయక-ప్రతినాయికలుగా వీరిద్దరూ ఎలా వుండబోతున్నారా అనే ఆసక్తి అందరిలోనూ వ్యక్తమవుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu