»   » అతను పెట్టిన ముద్దు జీవితంలో గుర్తుండిపోయింది అంటున్న హీరోయిన్

అతను పెట్టిన ముద్దు జీవితంలో గుర్తుండిపోయింది అంటున్న హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

టామ్ క్రూయిజ్ హాలీవుడ్ అందగాడన్న విషయం అందరికి తెలిసిందే. మిషన్ ఇంపాజబుల్ సిరీస్ ద్వారా యావత్ ప్రపంచం మొత్తం అభిమానులను సంపాదించుకున్నారు. ఇది మాత్రమే కాకుండా త్వరలో విడుదుల కానున్న మిషన్ ఇంపాజబుల్-4 లోఅందరిని అలరించడానికి సిద్దంగా ఉన్నారు. యుయస్ లోనిన్నజరిగినటువంటి రాచెల్ రో షోలో హాలీవుడ్ హీరోయిన్, అందాల తార జేనిత్ పాల్ట్రో ఎవ్వరికి తెలియనటువంటి ఓ నిజాన్ని బయటపెట్టారు.

ఇంతకీ ఆనిజం ఏమిటని అనుకుంటున్నారా..తన సినీ జీవితంలో ఆన్ స్క్రీన్ మీద జీవితంలో మరచిపోలేనటువంటి ముద్దు ఇచ్చినటువంటి హీరో టామ్ క్రూయిజ్ గా పేర్కోన్నారు. గతంలో జేనిత్ పాల్ట్రో బిగ్ స్క్రీన్ మీద రాబర్ట్ డోనీ జూనియర్, జూడ్ లా, బ్రాడ్ పిట్ లాంటి మహామహులతో చాలా సార్లు ముద్దు సీన్లలో నటించింది. కాని ఈఆస్కార్ విన్నర్ కువీళ్శ ముగ్గురికంటే కూడా టామ్ క్రూయిజ్ పెట్టనటువంటి ముద్దు మాత్రం జీవితాంతం మరిచపోలేని విధంగా ఉందని షోలో చెప్పడం జరిగింది.

ఈముద్దు ఏసందర్బంలో పెట్టాడో వివరించారు. గతంలో నేను టామ్ క్రూయిజ్ తో ఆస్టిన్ పవర్స్ 3 అనే చిన్న కామియోలో కలసి నటించడం జరిగింది. ఆసందర్బంలో టామ్ క్రూయిజ్ నన్ను తన బాహూ బంధాలలో గట్టిగా బిగించి ఇచ్చిన ముద్దు ఇప్పటకీ మరచిపోలేనటువంటి అనుభూతినిస్తుందని అన్నారు. అతని ముద్దులో అంత ఘాటు తనం ఉందని అన్నారు. అతను చాలా మంచి కిస్సర్ అని కితాబు ఇచ్చారు మన జేనిత్ పాల్ట్రో.

English summary
Gwyneth Paltrow says her most memorable onscreen kiss was with Tom Cruise.The actress has kissed some hot men on the big screen - Robert Downey Jr, Jude Law and Brad Pitt to name but three - but the Oscar winner has no problem picking her favourite: Tom Cruise.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu